పాక్ పరిస్థితి ఇంతకింతకు దిగజారిపోతున్నప్పటికీ ఇంకా కాశ్మీర్ పై మాత్రం దాని వ్యామోహం తగ్గడం లేదు. తాజాగా కాశ్మీర్ బ్లాక్ డే ను ఆ దేశం జరిపింది. కారణం అది తనదని, భారత్ ఆక్రమించినందుకు అంటూ ప్రపంచం ముందు కొత్త నాటకాలు వేస్తుంది. అసలు ఒకప్పటి భారత ప్రభుత్వం కాశ్మీర్ పై త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోవడం వలన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే భాగం తయారైంది. లేదంటే అసలు కాశ్మీర్ భారత్ భూభాగం మాత్రమే. అయినా నాకొక సందేహం, పాక్ వాళ్ళు ముందుకు వచ్చి ఒకప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు, మనవాళ్ళు దానిని తిరిగి తీసుకోవడానికి ఇంతగా ఆలోచిస్తారు ఎందుకు..? అని. సమాధానం పాతప్రభుత్వాలు  చెప్పాల్సి ఉండొచ్చుగాక. ఏది ఏమైనా కాశ్మీర్ భారత్ సొంతం మాత్రమే. కానీ తనదేదో భారత్ లాక్కున్నట్టుగా పాక్ ప్రపంచం ముందు కొత్త నాటకాలు ఆడితే దాని పరువే పోతుంది తప్ప భారత్ కు పోయేది ఏమిలేదు.

ఈ మాత్రం పాక్ ఆలోచించకుండా తెలివిలేని ప్రయత్నాలు ఎందుకు చేస్తుందో తెలియదు. బహుశా ప్రతి పని ఇటీవల చైనా దర్శకత్వంలోనే చేస్తుంది కనుక ఈ బ్లాక్ డే సంబరం కూడా అదే చేయమని ఉండొచ్చు. ఈ రెండు ఎప్పుడు భారత్ పై ఏడవటం తప్ప తమ దేశాలకు కూడా ఒరగబెట్టింది ఏమిలేదు. ఇంత కృషి వారివారి దేశాలపై పెట్టి ఉంటె, ఆ దేశంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. అంత మాత్రం మనసే ఉంటె, భారత్ లాంటి దేశంతో అనవసరపు గొడవలకు ఈ రెండు దేశాలు దిగవు, ఆ అవసరం కూడా రాదు. చైనా ఎంతగా మోసగిస్తున్నా కూడా పాక్ కు మాత్రం అది తెలిసిరావడం లేదనేది ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం. దాని వలలో పడిన వారందరు కూడా మేల్కొన్నారు కానీ, పాక్ మాత్రం ఇంకా మేల్కొనలేదా లేక విడిపించుకోవడానికి వీలులేకుండా చైనా ఉచ్చులో ఇరుక్కుపోయిందా అనేది పెద్ద సందేహమే.

భారత్ పాక్ లు కొట్టుకుంటున్నప్పటికీ, పాక్ ను దిగజారుస్తూ ఉంటె భారత్ కూడా ఎక్కడో అక్కడ కాస్త బాధ పడుతుందనేది చైనా వ్యూహం కావచ్చు. ఎంతైనా గతంలో పాక్ కూడా భారత్ లో భాగమే కదా, అందుకే దానికి నొప్పి కలిగిస్తే, భారత్ లో స్పందన రావచ్చు అనే కోణంలో కూడా చైనా ఆలోచించి, ఇతర దేశాలను వాడుకువదిలేసినట్టు పాక్ ను వదిలేయకుండా పట్టి పీడిస్తుంది కాబోలు. అదే పాక్ కు అర్ధం కాక, ఇంకా దానిని స్నేహితంగానే చూస్తుంది. తాజాగా భారీ పెనాల్టీ వేసినప్పటికీ అది చెప్పినట్టే వింటూ వస్తుంది పాక్. కుక్క తోక కూడా వంకర రావచ్చుగాక, పాక్ మాత్రం మారబోదనేది మరోసారి రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: