ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు ప్రియాంక తీవ్రంగా పోరాడుతున్నారు. ప్రజలకు ఎన్నడూ చూడని వరాల జల్లులు కురిపించేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ప్రియాంక బరిలో ఉన్నారు. ఆమెతోపాటుగా భారీగా ఈ రాష్ట్ర సీట్లను మహిళలకు కేటాయించారు. నిన్నటి నుండి ప్రతిజ్ఞ యాత్ర ప్రారంభించిన ఆమె ప్రజలకు వారాలజల్లులు కురిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. వచ్చేనెల ఒకటో తారీకు వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ ఎన్నికలలో గెలిచి, కాంగ్రెస్ కు మోడీని ఢీకొట్టే నాయకత్వం ఉందని నిరూపించేందుకు ప్రియాంక ప్రయత్నిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ యూపీలో ప్రభావం చూపించి గెలిస్తే, ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారు.

ఇక వరాల విషయానికి వస్తే, యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారట, కాంట్రాక్టు ఉద్యోగులను స్థిరం చేస్తారట, ఇంటర్ పాసైన వారికి స్మార్ట్ ఫోన్, డిగ్రీ పాసైన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్, రైతులకు రుణమాఫీ, గోధుమలు, వారి వంటి వాటి ధర క్వింటాకు 2500రూ., చెరకు 400రూ.  మద్దతు ధరలను  ఇస్తారట, కరోనా విపత్తులో విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తారట, పేదలకు 25000 చొప్పున ఆర్థిక చేయుత ఇస్తారట. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం బీజేపీ చేస్తున్న సిఏఏ ను అమలు చేయబోమని ప్రియాంక హామీల జల్లు ప్రకటించారు.

ఈ సరైన కనీసం ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. లేదంటే అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ కంటే దిగజారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే కేవలం యూపీలో బీజేపీ ని నిలువరిస్తే, యావత్ భారతదేశంలో నిలువరించినట్టే అని కాంగ్రెస్ బలంగా నమ్ముతుంది. అయితే అంతర్జాతీయంగా చుస్తే, ప్రభుత్వం మారితే మాత్రం చైనా, పాక్ లు రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  కనీసం ఈ ఒక్క దఫాకు బీజేపీ అధికారంలో ఉంటేనే చైనా, పాక్ ల వ్యూహాలను తిప్పికొట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: