తైవాన్ ను టచ్ చేస్తే తాటతీస్తా అంటోంది అమెరికా. తైవాన్ దేశాన్ని ఆక్రమించడానికి పావులు కదుపుతున్న చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. డ్రాగన్ ఇష్టానుసారంగా ముందుకు వెళితే ఊరుకునేది లేదని తెగేసి చెప్పింది అమెరికా. తైవాన్ దేశానికి ఎవరూ లేరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించింది. తైవాన్ దేశానికి మేమున్నామని  అమెరికా తేల్చి చెప్పేసింది. తైవన్ టచ్ చేస్తే మేము చూస్తూ ఊరుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా హెచ్చరించారు.


తమ బలం ఏ పార్టీతో  చైనా రష్యా కు తెలుసు అని, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు చేశారు జో బైడెన్. తీవ్రమైన తప్పిదాలకు దారితీసే చర్యలకు చైనా ఎక్కడైనా పాల్ పడుతుందో అని తమ ఆందోళన చెందుతున్నారు అమెరికా అధ్యక్షులు. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని తమ అభిప్రాయాలు మారబోదని స్పష్టం చేశారు. తైవాన్ పై గనుక చైనా దాడికి దిగితే అమెరికా తప్పకుండా స్పందిస్తుందని తెలియజేశారు. మరోవైపు అమెరికా వ్యాఖ్యలపై అయినా కూడా అంతే దీటుగా బదులిచ్చింది. తైవాన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది చైనా. తైవాన్ పూర్తిగా తమ భూభాగానికి చెందిందని ఇది పూర్తిగా మా అంతర్గత విషయం అని చైనా తెలియజేసింది. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని అనుమతించబోమని చైనా చెప్పేసింది. అటు తైవాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ చేసిన ఈ పరిణామాన్ని చైనా పూర్తిగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను దెబ్బ తీసే చర్యలను తక్షణమే విరమించుకోవాలని హెచ్చరించింది చైనా. ఇక చైనా అమెరికా మధ్య పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తైవాన్ దేశం కొత్త కేంద్ర బిందువుగా మారింది.

తైవాన్ ను పదే పదే రెచ్చగొడుతున్న చైనా పరోక్షంగా అమెరికాను కూడా కవ్విస్తోంది. నిత్యం తైవాన్ గగనతలంలో కి  యుద్ధ విమానాలు పంపడం ఆర్మీని పంపడం చైనాకు అలవాటయింది. తైవాన్ లో అవసరమైతే సైనికచర్యకు వెనకాడబోమని చైనా అగ్రరాజ్యం అమెరికా కు సవాల్ విసిరింది. దీంతో చైనాకు కౌంటర్గా అమెరికా బదులిస్తోంది. తైవాన్లో ఇప్పటికే తమ బలగాలను మోహరించింది. తైవాన్ లో శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. ఇలా చైనా అమెరికా మధ్యలో తైవాన్ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: