తెలంగాణ లోని హుజూరా బాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానిక ఉప ఎన్నిక జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ప్ర‌చారం గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ఇక్క‌డ అధికార టీఆర్ ఎస్ తో పాటు బీజేపీ మ‌ధ్య ప్ర‌చారం పోటా పోటీగా న‌డుస్తోంది. ప్ర‌చార గ‌డువు ముగుస్తుండ‌డంతో ఈ రెండు ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన రాష్ట్ర వ్యాప్త నేత‌లు అంద‌రూ హుజూరా బాద్‌లోనే మ‌కాం వేస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర మైన హుజూరా బాద్‌లో నేత‌ల తాకిడి నేప‌థ్యంలో అన్ని లాడ్జ్ లు , రెస్టారెంట్లు ఫుల్ అవుతున్నాయి. దీంతో వారంతా ఇప్పుడు ప్రైవేటు ఇళ్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

ఓ మోస్త‌రు బిల్డింగ్ ఉంటే చాలు వారం రోజుల‌కు వారు చెపుతోన్న అద్దెలు ఇప్పుడు ఆకాశం లోనే ఉంటున్నాయి. వారం రోజుల‌కు అద్దె రు. 10 వేల నుంచి రు. 15 వేల వ‌ర‌కు ప‌లుకు తోంది. మామూలుగా అయితే అక్క‌డ పెద్ద బిల్డింగ్ కు నెల‌కు మ‌హా అయితే రు. 4 నుంచి రు. 5 వేల అద్దె ఉంటోంది. ఇప్పుడు కేవ‌లం వారానికే చిన్న బిల్డింగ్ ల‌కు కూడా రు. 10 వేల అద్దె వ‌సూలు చేస్తున్నారు.

దీనికి తోడు ప‌లు మీడియా సంస్థ‌ల వాళ్ల తో పాటు ప్రైవేటు సర్వే ఏజెన్సీ లు కూడా అక్క‌డే మ‌కాం వేశాయి. నాయ‌కుల తో పాటు వారి ప‌రివారం , సిబ్బ‌ది, డ్రైవ‌ర్లు వీరంతా అక్క‌డే ఉంటున్నారు. వారంద‌రికి కూడా అక్క‌డ బ‌స , ఇత‌ర ఏర్పాట్లు కావాలి. దీంతో నాయ‌కుల‌కు చేతి చ‌మురు బాగానే వ‌దులు తోంద‌టు న్నారు. ఇక ఇళ్ల య‌జ‌మానులు మాత్రం నెల‌లోనే రు. 30 వేల నుంచి రు. 40 వేల వ‌ర‌కు వెన‌కే సుకుంటున్నార‌ట. ఇక హుజూరా బాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జ‌రుగుతుంది. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: