టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత సన్రైజర్స్ హైదరాబాద్ మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్... అతని పూర్తి పేరు. 1974 సంవత్సరంలో హైదరాబాద్ మహానగరంలో జన్మించిన వి.వి.ఎస్.లక్ష్మణ్ టీమిండియా జట్టుకు అనేక విజయాలను సాధించి పెట్టాడు. వివిఎస్ లక్ష్మణ్ తన కెరీర్లో ఇప్పటి వరకు 127 టెస్టు మ్యాచ్లు ఆడగా వేగంగా 86 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించారు.  ఇక ఆ టెస్ట్ మ్యాచ్ లలో వివిఎస్ లక్ష్మణ్ 16 సెంచరీలు చేయగా వన్డేలలో కేవలం ఆరు సెంచరీలు చేసి ... పర్వాలేదనిపించారు. గాడ్ టెస్ట్ ప్లేయర్ గా ముద్రపడిన వివిఎస్ లక్ష్మణ్...  తన కెరీర్లో 181 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు ను సంపాదించారు.

 మొదట్లో దేశవాళీ క్రికెట్ లో భాగంగా హైదరాబాదు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వి.వి.ఎస్.లక్ష్మణ్... ఈ నేపథ్యంలోనే టీమిండియాకు సెలక్ట్ అయ్యారు. అయితే తే.గీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అనంతరం వి.వి.ఎస్.లక్ష్మణ్ ఐపీఎల్ లో మొదటిసారిగా డెక్కన్ చార్జెస్ కెప్టెన్గా వ్యవహరించారు. ఇక 2011 సంవత్సరంలో అవార్డు కూడా వచ్చింది. ఇది ఇలా ఉండగా.. వివిఎస్ లక్ష్మణ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిఎస్ లక్ష్మణ్...  జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలతో వి.వి.ఎస్.లక్ష్మణ్ చర్చలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.  సెలబ్రిటీల ను ఎప్పుడు ఎంకరేజ్ చేసే భారతీయ జనతా పార్టీ... అందులో భాగంగానే వీవీఎస్.లక్ష్మణ్ ను తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల లోపే భారతీయ జనతా పార్టీలో చేరుతారని సమాచారం. అయితే... గ్రేటర్ హైదరాబాద్లోని ఓ నియోజకవర్గం నుంచి వివిఎస్ లక్ష్మణ్ ను ఎమ్మెల్యేగా బరిలోకి దించే ఆలోచన కూడా బిజెపి చేస్తోందట. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: