షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ సీబీపై.. ఈ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవీ-ఎన్సీబీ మధ్య ముడుపుల వ్యవహారం నడుస్తోందని అతడి బాడీ గార్డ్ గా చెప్పుకుంటున్న సెయిల్ ఆరోపించాడు. అంతేకాకుండా తన నుంచి బ్లాంక్ పంచనామాపై ఎన్సీబీ బలవంతంగా సంతకం చేయించుకుందన్నాడు. అయితే ఈ ఆరోపణలను ఎన్సీబీ తోసిపుచ్చింది.

ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి నుంచి ఎన్సీబీ డబ్బులు అడుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. తెల్ల కాగితాలపై ఎన్సీబీ సాక్షుల సంతకాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు ఆర్యన్ కు సంబంధించిన ఓ వీడియోను రౌత్ బయటపెట్టారు. ఎన్సీబీ కార్యాలయంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ గోసవి.. ఎవరితోనో ఆర్యన్ ఖాన్ మాట్లాడినట్టుంది.

ఇక ఆర్యన్ ఖాన్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ బెయిల్ పిటిషన్లంటినీ కోర్టు తోసిపుచ్చిన కారణంగా.. ముంబై హైకోర్టులో పిటిషన్ వేశాడు. తన వాట్సాప్ చాట్స్ ను ఎన్సీబీ వక్రీకరిస్తోందని.. తనపై నిందారోపణలు చేస్తోందని తాజా బెయిల్ పిటిషన్ లో ఆర్యన్ ఎన్సీబీపై ఆరోపణలు చేశాడు.

మరోవైపు బీజేపీపై మహారాష్ట్ర మంత్రి ఛఘన్ బుజ్ బల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కారణంగా బుజ్ బల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో 3వేల కిలోల డ్రగ్స్ దొరికినా.. లైట్ తీసుకున్నారని.. కావాలనే ముంబైపై టార్గెట్ చేస్తున్నారని అన్నారు. చూద్దాం.. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఆర్యన్ ఖాన్ మాత్రం బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్సీబీ మాత్రం బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు అవుతాయంటోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: