జగన్ రెండున్నరేళ్ళుగా తాడేపల్లి లోనే ఉంటున్నారు. ఆయన తెల్లారి లేస్తే వివిధ శాఖల స‌మీక్షలు అన్నీ కూడా అక్కడ నుంచే చేపడుతున్నారు. ఇక మంత్రి వర్గ సమావేశం అయితే ఆయన సచివాలయానికి వెళ్తున్నారు. అంతే తప్ప ఆయన మొత్తం ఆఫీస్ డ్యూటీస్ అన్నీ కూడా కేరాఫ్ తాడేపల్లి గానే చేస్తున్నారు. దీని మీద విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి.

సరే వారి సంగతి అలా ఉంచితే జగన్ కూడా జనంలోకి రావాలనుకుంటున్నారు. ఆయన రచ్చ బండ పేరిట ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి ఫీడ్ బ్యాక్ నేరుగా తీసుకోవాలనుకుంటున్నారు. తాను చేపట్టిన అనేక కార్యక్రమాల రిజల్ట్ ని కూడా డైరెక్ట్ గా ప్రజల నుంచే తెలుసుకోవాలన్న ఆరాటం ఆయనకు ఉంది. కరోనా మహమ్మారి రెండు దశల వల్ల అది కుదరలేదు. అయితే ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టింది. మూడవ దశ రాదు అనే పరిశోధకులు  అంటున్నారు.

దాంతో వచ్చే ఏడాది అంటే 2022 నుంచి జనంలోకి రావాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. తన తండ్రి ప్రారంభించాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని తాను మొదలుపెట్టి జనంలోకి వెళ్ళి వారితోనే మమేకం కావాలన్నది జగన్ కోరికగా ఉంది అంటున్నారు. ఇక రచ్చబండను జగన్ ఎక్కడ చేపడతారు అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆయన గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్రా దక్షిణాంధ్రా, రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. అయితే రచ్చబండ ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా కుప్పంలో రచ్చబండను నిర్వహించి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పెను సవాల్ విసరాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. అక్కడే ప్రజలకు పధకాలు అన్నీ అందాయని వారితోనే చెప్పించి తన ప్రభుత్వం గురించి టీడీపీ చేస్తున్న విమర్శలకు గట్టి జవాబు చెప్పాలనుకుంటున్నారుట. మొత్తానికి జగన్ రచ్చబండ విపక్షాలకు ఒక సవాల్ అయితే కుప్పం టూర్ అన్నది మరింత రచ్చగానే ఉండబోతోంది అంటున్నారు అంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: