గ్రామ స‌చివాల‌యాల పేరిట రాష్ట్రంలో  పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ నిర్వ‌హించామ‌ని చెప్పే వైసీపీ స‌ర్కారు క‌ఠిన వైఖ‌రికి నిద‌ర్శ‌నం ఇది. జీతాలు అక్టోబ‌ర్ రెండు త‌రువాత పెరుగుతాయ‌ని చెప్పి ఆ మాట కూడా పాటింపులో లేని వైనం పై క‌థనం ఇది.


అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌విధంగా లేనప్పుడు ఒక విధంగా మాట్లాడ‌డంలో వింతేం లేదు. అది రాజ‌కీయ నాయ‌కుల అవ‌సరం కూడా! అవ‌సరార్థం ఉండే రాజ‌కీయాల‌ను త‌ప్పు ప‌ట్ట‌కూడ‌దు. వాటిలో మంచి చెడు అన్న‌ది వెతికి చూడ‌కూడ‌దు. ఆంధ్రావ‌నిలో జ‌రుగుతున్న‌ది ఇదే. అయినా ఎవ్వ‌రూ జ‌గ‌న్ ను ప్ర‌శ్నించ‌కూడ‌దు. ప్ర‌శ్నిస్తే అధికార ప‌క్షానికి విప‌రీతం అయిన కోపం వ‌స్తుంది. ఆ కోపంలో భాగంగా ఏమ‌యినా జ‌ర‌గవ‌చ్చు. తాజాగా స‌చివాల‌య ఉద్యోగుల జీతాల చెల్లింపున‌కు సంబంధించి ఒక వివాదం న‌డు స్తోంది. ఉద్యోగుల బ‌యో మెట్రిక్ ఆధారంగా జీతాల చెల్లంపున‌కు రంగం సిద్ధం అయింది. అయితే త్వ‌ర‌లోనే వీరిని రెగ్యుల‌రైజ్ చేయ‌నున్నారు క‌నుక ఇప్ప‌టి నుంచే కొన్ని కోత‌లు, కొన్ని ష‌ర‌తులు అమ‌ల‌యిపోతున్నాయి.


సెప్టెంబ‌ర్ 23 నుంచి అక్టోబ‌ర్ 22 వ‌రకూ ఉద్యోగుల బ‌యోమెట్రిక్ ప‌రిశీలించాక అటుపై జీతాలు వేయ‌నున్నారు. ఇక్క‌డే పెద్ద ట్విస్టు ఉంది. జీతాలు ఎన్న‌డూ  లేనిది బయోమెట్రిక్ ను క‌న్సిడ‌ర్ చేసి వేయ‌డం ఏంట‌ని కొన్ని చోట్ల సాంకేతిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, గిరిజ‌న ప్రాంతాల‌లో అస్స‌లు స‌ర్వ‌ర్ క‌నెక్ట్ కాద‌ని సంబంధిత ఉద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నారు. జీతాల‌లో ప‌ది శాతం నుంచి యాభై శాతం వ‌ర‌కూ కోత‌లు విధించి ఏం సాధిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రొహిబిష‌న్ పీరియ‌డ్ కోసం ఎదురు చూస్తున్న స‌చివాల‌య ఉద్యోగుల‌కు జీతం  పెర‌గ‌క పోగా, ఉన్న జీతంలో కోత‌లు విధిస్తూ ఏపీ స‌ర్కారు ప‌రీక్ష‌లు పెడుతోంది.

జీతాల్లో కోత‌ల‌పై సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ లో పాల్గొన్న ఉద్యోగులు ఎలా బ‌యోమెట్రిక్ వేయ‌గ‌ల‌ర‌ని, అదేవిధంగా సాంకేతిక స‌మ‌స్య‌లు చాలా ఉంటుండ‌గా బ‌యోమెట్రిక్ ఆధారంగానే  జీతాలు వేయ‌డం ఏంట‌ని ఈ విధానం అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ అమ‌లు చేస్తున్నారా అని ప్ర‌శ్నిస్తున్నారు. తాము రాత్ర‌న‌క‌, ప‌గ‌లన‌క క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని కానీ త‌మ శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం లేద‌ని త‌క్కువ  జీతాల‌లో జీవితాలు నెట్టుకు రావ‌డం క‌ష్టంగానే
ఉంద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: