ఇవాళ ఢిల్లీ టూరులో చంద్ర‌బాబు ఉంటారు. ఇవాళ రేపు కూడా అక్క‌డే ఉంటారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అప్ర‌జాస్వామిక పాల‌న కు సంబంధించి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, హోం మంత్రితో స‌హా ఇత‌ర పెద్ద‌ల‌కు వివ‌రిస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. త‌నకు జ‌రిగిన ప‌రాభ‌వం గురించి, పార్టీ కార్యాలయం పై దాడి గురించి ఇప్ప‌టికే లేఖ‌లు రూపంలో వివ‌రించిన చంద్ర‌బాబు మ‌రో మారు తన ఆగ్ర‌హావేశాలు ఢిల్లీ కేంద్రంగా వెల్ల‌డించి, ఇక్క‌డి ప‌రిణామాల‌ను కూలంకుషంగా వివ‌రించనున్నారు. విస్త‌రించ‌నున్నారు.

అదేవిధంగా రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు సంబంధించి మాట్లాడ‌నున్నారు. స్వ‌భావ రీత్యా తాను రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు వ్య‌తిరేక‌మే కానీ రాష్ట్రంలో ఉన్న పాల‌నను చూసి విసుగెత్తి కోరుతున్నామ‌ని అంటున్నారు చంద్ర‌బాబు. అదేవిధంగా దేవాల‌యం లాంటి కార్యాల‌యంపై దాడి చేసి ఏం సాధిస్తార‌ని..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా దాడుల సంస్కృతి ఉంద‌ని, దీనిని నిలువ‌రించాల్సిన బాధ్య‌త కేంద్రంపై కూడా ఉంద‌ని అంటున్నారు బాబు. ఇదే త‌రుణంలో మోడీ ఎటువైపు?

చంద్రబాబు అధికారంలో ఉండ‌గా మోడీతో విభేదాలు వ‌చ్చాయి. దాంతో అల‌యెన్సు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు చంద్ర‌బాబు. ఆ రోజు జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీని తీవ్రంగా విమ‌ర్శించారు. బీజేపీతో విభేదించారు. ఇవ‌న్నీ చంద్ర‌బాబు రాజ‌కీయ ప‌త‌నానికి కార‌ణం అయ్యాయి అన్న‌ది వైసీపీ విశ్లేష‌ణ‌. చంద్ర‌బాబు సైడ్ అయిపోయి జ‌గ‌న్ కు దారి ఇచ్చారు. దాంతో జ‌గ‌న్, బీజేపీ బంధం బ‌ల‌ప‌డ‌డ‌మే కాకుండా ఎన్నిక‌లకు సంబంధించి చాలా స‌హ‌కారమే అందించింది. ఫండింగ్ కు సంబంధించి కొన్ని త‌ల‌నొప్పులు ఆ రోజు జ‌గ‌న్ కు వ‌స్తే..ఆయ‌న‌కు సంబంధించి అకౌంట్ల‌ను ఈడీ ఫ్రీజ్ చేసిన‌వి ఉంటే వీటిని అన్ లాక్ చేయించింది బీజేపీ. ఇవ‌న్నీ వైసీపీకి క‌లిసివ‌చ్చాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బాబు, బీజేపీ బంధం బ‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకున్నా రేపటి వేళ జ‌రిగేదే ఇది. క‌నుక బాబు మాట మోడీ వింటారు. అటుపై జ‌గ‌న్ కు కొన్ని సూచ‌న‌లు చేస్తారు. ఇప్ప‌టికే కోర్టుల‌లో న‌వ్వుల పాల‌వుతున్న జ‌గ‌న్ స‌ర్కారు పై మోడీకి పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. ఆయ‌న పంచుతున్న డ‌బ్బులు సంబంధిత ప‌థ‌కాలు ఇవ‌న్నీ మోడీ కోపాల‌కు కార‌ణం అవుతూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో జ‌గ‌న్ ను కాద‌ని బాబుకు ప్రాధాన్యం ఇచ్చే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తున్నారు మోడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: