మ‌న్ కీ బాత్ పేరిట మోడీ మ‌ళ్లీ డైలాగులు పేల్చాడు. ఎప్ప‌టిలానే త‌న త‌ర‌హా వాద‌న ఒక‌టి వినిపింప‌జేశాడు. మోడీ మ‌రియు ఆయ‌న ప్ర‌భుత్వం ఎప్ప‌టిలానే చెప్పాల్సిన మాట‌లు చెబుతూ ఉన్నాయే వాటి వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేద‌ని తేల్చేశాడు మ‌రోసారి. ముఖ్యంగా నిన్న‌టి మ‌న్ కీ బాత్ లో స్థానిక ఉత్పత్తుల‌ను ఆద‌రించాలి అని, ఆ విధంగా సంబంధిత రంగాల‌ను ఆదుకోవాల‌ని దేశ ప్ర‌జ‌లకు పిలుపు ఇచ్చాడు. పండుగ‌ల వేళ స్థానిక ఉత్ప‌త్తుల‌ను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు క‌థ ఒక‌టి మొద‌లైంది. అదేంటో చూద్దాం.

వాస్త‌వానికి చేనేత వ‌స్త్రాల‌కు కేంద్రం ఇస్తున్న మ‌ద్దతు ఏమీ లేదు. ఆ మాట‌కు వ‌స్తే రాష్ట్ర ప్ర‌భుత్వాలే ఉన్నంత‌లో ఏవో ప‌థ‌కాలు పేరిట సాయం చేస్తున్నాయి. ఏడాదికి ప‌దివేలు రూపాయ‌లు చొప్పున చేనేత కుటుంబాల‌కు జ‌గ‌న్ అందిస్తున్నారు. ఇంత‌కుమించి పెద్ద‌గా వారికి సాయం చేస్తున్న‌ది లేదు. ఇప్పుడు పొందూరు ఖాదీకి దేశ వ్యాప్తంగా ఉన్న పేరు ఎంత ఉన్నా ప్ర‌భుత్వాలు వాటికి మార్కెటింగ్ సౌక‌ర్యం ఇవ్వ‌క‌పోతే సంబంధిత క‌ళాకారులు బ‌తుకు మ‌రింత దుర్భ‌ర‌మే.

అదేవిధంగా పొందూరు ఖాదీకి సంబంధించి నాయ‌కులు నాలుగు మంచి మాట‌లు చెప్పి త‌రువాత వాటి ఊసెత్త‌కుండా ఉంటే అది కూడా మంచిది కాదు. ఒక్క పొందూరు ఖాదీ అనే కాదు ఇవాళ ఏ స్థానిక ఉత్ప‌త్తుల‌కూ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రోత్సాహం కానీ మ‌ద్ద‌తు కానీ లేవు. ఉన్న‌దంతా ఓటు బ్యాంకు రాజ‌కీయ‌మే! ఇదే క్ర‌మంలో స్థానిక ఉత్ప‌త్తులు అయిన కొండ ప‌ల్లి బొమ్మ‌ల‌కు, బొబ్బిలి వీణ‌ల‌కు కూడా గిరాకీ ఉన్న చేసిన ప‌ని గిట్టుబాటు లేదు. వీటి గురించి ఏటి కొప్పాల బొమ్మ‌ల గురించి ఇంకా ఇంకొన్నింటి గురించి ప్ర‌సంగాల్లో దంచికొట్టే నేత‌లు వారికి ఊతం ఇచ్చే ప‌నులు మాత్రం చేయ‌డం లేదు. తాజాగా ప్ర‌ధాని నిర్వ‌హించిన మ‌న్ కీ
బాత్ కూడా అలాంటిదే! అయినా కూడా మోడీ మాట‌ల‌పై మ‌నం న‌మ్మ‌కం పెంచుకోవాల్సిందే. లేదంటే మ‌న‌కు దేశ భ‌క్తి లేద‌ని
బీజేపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసినా చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp