ఏపీ మంత్రుల్లో మంచి సబ్జెక్ట్ మాట్లాడే వారు చాలా తక్కువనే చెప్పాలి...మాటల ఎదురుదాడి తప్ప, సబ్జెక్ట్‌తో మాట్లాడే నాయకులు తక్కువ. కానీ సబ్జెక్ట్‌తో ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే సామర్థ్యం ఉన్న మంత్రుల్లో కన్నబాబు ముందు ఉంటారు. స్వతహాగా జర్నలిస్ట్ అయిన కన్నబాబుకు మంచి సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయ శాఖ మంత్రిగా కన్నబాబు బాగానే పనిచేసుకుంటున్నారు. అయితే ఇదంతా మొదటలో...ఇప్పుడు కన్నబాబు వర్షన్ చాలా మారినట్లు కనిపిస్తోంది.

ప్రతిపక్ష పార్టీలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు...అదే సమయంలో మిగతా వాళ్ళ మాదిరిగానే మాటల దాడి చేస్తున్నారు. అందులో తప్పు ఉందో....ఒప్పు ఉందో అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు లేదని తెలుస్తోంది. అందుకే కన్నబాబుని సైతం ప్రతిపక్షాలు టార్గెట్ చేసే పరిస్తితి ఉంది. అటు చంద్రబాబుని గానీ, ఇటు పవన్ కల్యాణ్‌పై గానీ కన్నబాబు మాటల దాడి ఎక్కువగానే ఉంది. అందుకే కన్నబాబుని సైతం టీడీపీ-జనసేనలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి.

నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయి. అయితే ఇక్కడ సోలోగా టీడీపీ ఎంతవరకు కన్నబాబుకు చెక్ పెడుతుందో చెప్పలేని పరిస్థితి... అదే సమయంలో జనసేన ఒంటరిగా బరిలో దిగితే  కన్నబాబుకు ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది. గత ఎన్నికల్లో అదే పరిస్తితి. టీడీపీకి పడాల్సిన ఓట్లు జనసేన చీల్చేయడం వల్ల కన్నబాబు గెలిచేశారు. కాకినాడ రూరల్ బరిలో దిగిన కన్నబాబు టీడీపీ మీద 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కానీ అక్కడ జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి ఉంటే...ఖచ్చితంగా కన్నబాబుకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్నబాబుకు గెలిచే ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనేది పవన్ ఆలోచించుకోవాలి. ఒకవేళ పవన్...టీడీపీతో కలిస్తే కన్నబాబుకు ఖచ్చితంగా చెక్ పడుతుందనే చెప్పొచ్చు. మరి చూడాలి కన్నబాబుకు..పవన్ మరో ఛాన్స్ ఇస్తారో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: