రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌త శ‌త్రువులు కారు. శాశ్వ‌త మిత్రులూ ఉండ‌రు. అవ‌కాశం-అవ‌స‌రం అనే సూత్రం ఆధారంగానే నాయ కులు ప్ర‌య‌త్నం చేస్తారు.. ప్ర‌యాణం సాగిస్తారు. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. అయితే.. రెండు ద‌శాబ్దాల కిందటి వ‌ర‌కు ఒక పార్టీలో ఉన్నామ‌ని చెప్పుకొనేందుకు ఒక పార్టీ కింద జీవితాంతం రాజ‌కీయాలు సాగించేందుకు.. నాయ‌కులలు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే.. రానురాను వ్య‌క్తిగ‌త ప్రాబ‌ల్యం.. ప్ర‌చారం.. రాజ‌కీయం పెరిగిపోయిన ద‌రిమిలా.. నాయ‌కుల స్వామ్యం పెరిగిపోయింది. అంటే.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ పార్టీల బ‌లాలు త‌గ్గిపోయి.. చాలా జిల్లాల్లో వ్య‌క్తుల ప్ర‌భావం.. నేత‌ల దూకుడు పెరిగింది. దీంతో రాష్ట్రంలో జంపింగులు పెరిగిపోయాయి.

దీనికి.. ముద్దుగా.. నాయ‌కులు.. అనేక పేర్లు పెట్టుకుంటున్నారు. అభివృద్ధిని చూసి పార్టీ మారామ‌ని.. గ‌తంలో చెబితే.. ఇప్పు డు.. కొన్ని పార్టీలు వృద్ధ పార్టీలు అయ్యాయ‌ని.. ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను కొల్పోయాయ‌ని.. అందుకే పార్టీల‌కు దూరంగా ఉంటు న్నామ‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా క‌ర్నూలుకు చెందిన మాజీ మంత్రి, యువ నాయ‌కురాలు.. భూమా అఖిల ప్రియ‌..కూడా చేరిపోతున్నారు. ఇప్ప‌టికే పార్టీలు మార్చే కుటుంబంగా పేరున్న బూమా కుటుంబానికి పార్టీలు మారడం కొత్త‌కాద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, శ్రీశైలం స‌హా.. ఆ బెల్టులోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో భూమా వ‌ర్గం బ‌లంగా ఉండ‌డం. వ‌క్తిగ‌తంగా వారు ఎదిగిపోవ‌డం.. వంటివి ఈధీమాకు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.

గ‌తంలో టీడీపీలో రాజ‌కీయాలు ప్రారంభించిన భూమా కుటుంబం 2007లో చిరంజీవి పార్టీ పెట్ట‌డంతో ప్ర‌జారాజ్యంలోకి జంప్ చేసింది. త‌ర్వాత‌.. ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో.. వైసీపీవైపు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల టికెట్ లు తెచ్చుకున్నారు. స‌రే.. ఎన్నిక‌ల‌కు ముందుగానే శోభ మృతి చెంద‌డం.తో ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అఖిల విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, నాగిరెడ్డి నంద్యాల నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే..తర్వాత‌.. 2017లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కావొచ్చు.. మంత్రి ప‌ద‌వుల‌పై ఉన్న కోరిక కావొచ్చు.. సైకిల్ ఎక్కారు. ఈ క్ర‌మంలోనే నాగిరెడ్డి మృతి అనంత‌రం అఖిల కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిత‌ర్వాత‌.. టీడీపీలో అఖిల ప్రియ దూకుడుగానే ఉన్నా.. ఆమెకు ఆశించిన మేర‌కు పార్టీ నుంచి గుర్తింపు, మ‌ద్ద‌తు కూడా ల‌భించ‌డం లేదు. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ గెలుస్తుందా? అనే చ‌ర్చ కూడా వారిని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. మ‌రోవైపు త‌మ‌కు రెండు టికెట్లు కావాల‌ని.. అఖిల పెట్టిన ఇండెంట్‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు.. పార్టీలో వ‌ర్గ‌పోరు మ‌రింత‌గా సెగ పెడుతోంది. సో.. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇక‌, టీడీపీలో ఉండ‌డం క‌ష్ట‌మనే భావ‌న అఖిల ప్రియ కుటుంబంలో స్పష్టంగా వినిపిస్తోంది. ఇదేదో.. జ‌నసేన‌లో నే ఉండి చేసుకుంటే.. బెట‌ర్ అనుకుంటున్నార‌ట‌. ఓ చ‌క్క‌ని ముహూర్తం చూసుకుని జ‌న‌సేన వైపు వెళ్లాల‌ని.. ఆలోచిస్తున్న‌ట్టు క‌ర్నూలులో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. మెగా కుటుంబంతో ఉన్న ఈజ్‌ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో వీరికి మంచి పొజిష‌న్ ల‌భిస్తుంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: