వైసీపీని ఏదో చేద్దామ‌ని.. ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేయాల‌ని.. టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. ఏ ఒక్క‌టీ ఫ‌లించ‌డం లేదు. పైగా.. ఆ పార్టీకి సానుభూతికి కూడా ద‌క్క‌డం లేదు. అదేస‌మ‌యంలో అధికార పార్టీవైపు ప్ర‌జ‌లు మ‌రింత సానుభూతి చూపిస్తున్న‌ట్టు తాజాగా వెల్ల‌డ‌వుతున్న ఫ‌లితం స్ప‌ష్టం చేస్తోంది. నిజానికి గ‌డిచిన వారంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డాన్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా నిర‌సిస్తున్నారు. ఎక్క‌డ ఏ ఇద్ద‌రు చేరినా.. దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు. ``ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నా.. అన్నిమాట ప్ర‌కారం న‌వ‌ర‌త్నాల‌ను అమ‌లు చేస్తున్నాడు`` అనే మాట జ‌గ‌న్ విష‌యంలో వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో చీటికీ మాటికీ.. వైసీపీపై విరుచుకుప‌డ‌డం.. అయిన‌దానికీ కానిదానికీ.. ఆ పార్టీని దూషించ‌డం వంటివి టీడీపీకి మైన‌స్‌గా మారుతున్నాయి. స‌రే.. ఈ రెండు పార్టీల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వైసీపీ విష‌యాన్ని తీసుకుంటే.. నిజంగానే ఈ రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ నిజంగానే భ్ర‌ష్టు ప‌ట్టిపోయిందా?  ప్ర‌జ‌ల‌కు దూర‌మైందా?  టీడీపీ నేత‌లు చెబుతున్న‌ట్టు రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతోందా? అంటే.. అదేమీ క‌నిపించ‌డం లేద‌నేది ఇటీవ‌ల ఐఎన్ ఏఎస్‌-సీ ఓట‌రు నిర్వ‌హించిన స‌ర్వేలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇదే భావ‌న‌తో ఉంటే.. ముఖ్య‌మంత్రిపై వ్య‌తిరేక‌త వ‌చ్చి ఉండాలి. కానీ.. ఎక్క‌డా ముఖ్య‌మంత్రిపై వ్య‌తిరేక‌త రాలేదు. కేవ‌లం ఎమ్మెల్యేల‌పై మాత్రం ప్ర‌జ‌లు ఆగ్రహంతో ఉన్నార‌ని తెలుస్తోంది.

ఈ విష‌యంలో స్ప‌ష్టత ఉంది. ఎలా అంటే.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అంద‌రికీ చేరుతున్నాయి. అర్హులైన వారిని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోంటోంది. ఇదే.. ప‌రిణామాలు.. అన్ని ఎన్నిక‌ల‌లోనూ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ వ్య‌తిరేక‌త ఉండి ఉంటే.. అది ఖ‌చ్చితంగా పార్టీపై ప్ర‌భావం చూపించాల్సి ఉంది. కానీ, అలా లేదు. సో.. వైసీపీకి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా ఉన్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పై ఒకింత అస‌హ‌నం ఉంటే ఉండొచ్చు. దీనికి కార‌ణం ర‌హ‌దారులు బాగోలేక పోవ‌డం.. దీనిపై జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌తో ముందుకు వ‌స్తున్నార‌నే స‌మాచారం ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు చేరింది. ఈ క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌లు క‌నుక ప‌రిష్క‌రిస్తే.. ఇక‌, సీఎంకు తిరుగు ఉండ‌దు అనే టాక్ వినిపిస్తోంది.

మ‌రీ ముఖ్యంగా కేంద్రం-రాష్ట్ర సంబందాల‌పైనా.. మేధావులు దృష్టి పెడుతున్నారు. అయితే.. ఇప్పుడు వీటిలో పెద్ద‌గా పురోగ‌తి క‌నిపించ‌క‌పోయినా.. మున్ముందు క‌నిపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఎలా అంటే.. కేంద్రంపై ఇప్ప‌టి వ‌ర‌కు సానుకూల కోణంతో ఉన్న వైసీపీ నేత‌లు.. ఇక నుంచి సానుకూల‌త‌ను పాడు చేసుకోకుండా.. కండిష‌న్డ్ రాజ‌కీయాలు చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. కేంద్రానికి ఏ విధంగా స‌హ‌క‌రించాల‌న్నా.. వెంట‌నే త‌క్ష‌ణ సాయం కింద‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించాల‌ని భావిస్తున్నారు. ఇది వైసీపీకి మెరుగైన ఫ‌లితం చూపిస్తుంద‌నేది .. విశ్లేష‌కుల మాట‌. రాజ‌కీయంగా చూసుకున్నా.. అబివృద్ధి ప‌రంగా చూసుకున్నా.. వ‌చ్చే రెండేళ్ల‌కాలంలో జ‌గ‌న్ మెరుపులు మెరిపించ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. సో.. దీనిని బ‌ట్టి ప్ర‌జ‌లు వైసీపీవైపే ఉన్నార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: