మాజీ మంత్రి, ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు జంపింగ్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అన్న‌ది తెలిసిందే. ఆయ‌న ప్ర‌తి ఎన్నిక ల‌కు పార్టీల తో పాటు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా మ‌రిపోతూ ఉంటారు. ఇది ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి వైసీపీ క్యాండెట్ కెకె. రాజు చేతిలో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచిన గంటా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. ఇక ష‌రా మామూలుగా ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందే మ‌ళ్లీ పా ర్టీతో పాటు నియోజ‌క‌వ‌ర్గం కూడ మారిపోతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీ క‌రిస్తూ ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఇప్ప‌టికే రాజీనామా చేశారు. గంటా త‌న రాజీనామా ను స్పీకర్ ఫార్మాట్ లోనే చేసినా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. తన రాజీనామా ఆమోదించి ఉప ఎన్నికలు జరిగితే తాను తిరిగి పోటీ చేయనని కూడా గంటా చెప్పి యేడాది అవుతోంది. అయితే ఇప్పుడు గంటా కు టీడీపీ లోనే సెగ స్టార్ట్ అయ్యింది. ఆయ‌న్ను ఆ పార్టీ వాళ్లు ప‌ట్టించు కోవ‌డం లేదు.

పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అక్క‌డ సీటు ఇస్తార‌ని.. ఆయ‌న‌కు ప్ర‌యార్టీ ఉంటుంద‌న్న గ్యారెంటీ కూడా లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం గా ఉంటూ వ‌స్తున్నారు. దీంతో గంటా శ్రీనివాస రావు జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టాక్ ? ఆ పార్టీలో చేరితే అక్క‌డ పేరున్న నాయ‌కులు ఎవ్వ‌రూ లేరు. దీంతో ఆయ‌న ఆ పార్టీ లో ఫుల్ గా చ‌క్రం తిప్ప‌వ‌చ్చ‌ని ప్లాన్లు వేసుకుంటున్నార‌ట‌.

పైగా రేప‌టి వేళ గంటాకు టీడీపీ వాళ్లు పార్టీ గెలిచినా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌రు. అదే జ‌న‌సేన లో చేరితే టీడీపీతో పొత్తు ఉంటే త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని గంటా లెక్క‌లేసుకుంటున్నారు. వ‌చ్చే యేడాది చివ‌ర్లో గంటా పార్టీ మార‌తార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: