తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ‌కీయంగా ఇప్పుడు దూకుడు పెంచాల్సిన టైం వ‌చ్చేసింది. ముఖ్యంగా ఆయ‌న పదవుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోన్న వాతావ‌ర‌ణం అయితే క‌నిపిస్తోంది. వ‌చ్చే సాధార‌ణ ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప‌లు ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ కానున్నాయి. ఇప్పుడు ఆరు ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా కూడా...  ఈ ఆరు ఎమ్మెల్సీలు అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుండ‌డంతో ఆశావాహుల మాత్రం మామూలుగా లేరు. ఈ జూన్ లోనే ప‌లువురు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగిసింది. ఇప్పుడు వీటిని భ‌ర్తీ చేయాల్సి ఉంది.

క‌రోనా దెబ్బ‌తో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవకాశముంది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియ‌ర్లు త‌మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. కొంద‌రు అయితే త‌మ‌కు కేసీఆర్ ప‌ద‌వి పై హామీ ఇచ్చేశార‌ని చెప్పుకుంటున్నారు.

ఆశావాహుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి - కడియం శ్రీహరి - కర్నె ప్రభాకర్ - తుమ్మల నాగేశ్వరరావు - మధుసూదనాచారి తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవ‌ల ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా గ‌వ‌ర్న‌ర్ కోటాలో హుజూరాబాద్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి ని ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు.

అయితే ఈ సారి సీనియ‌ర్ల‌ను కేసీఆర్ ప‌ట్టించు కోక‌పోతే వారి నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ముఖ్యం గా తుమ్మల తో పాటు క‌డియం లాంటి వాళ్ల‌కు ప్రాధాన్య‌త లేద‌ని వారు ర‌గులుతున్నారు. ఈ సారి కూడా వారిని ప‌ట్టించు కోక‌పోతే వారు కేసీఆర్ కు ఎలాంటి ఝుల‌క్ లు అయినా ఇస్తార‌ని.. ఊహించ‌ని షాకులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: