ఒక్క సంతకం విలువ  150 కోట్లు.ఇండియన్ బిజినెస్ వారసుడు ఒక గవర్నర్ కు ఇమజూపిన లంచం ఇది. ఫైల్పై సంతకం పెట్టు 150 కోట్లు పట్టు అంటూ గవర్నర్కు ఆమ్యామ్యా ఇమజూపారట అనిల్ అంబానీ. ఇంతకీ ఏ ఫైల్పై శతకానికి అంత ఇమజూపారు. దీని వెనుక స్కామ్ ఏంటి? ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది?. ఒక్క సంతకం ప్రభుత్వాలను కూల్చే సంతకం, నిలబెట్టే సంతకం. కోట్లకు కోట్లు కాంట్రాక్టులు ఇచ్చే సంతకం. ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం అత్యంత విలువైంది. ఇక గవర్నర్ సంతకం అల్టిమేట్. పార్లమెంటు,అసెంబ్లీ లో ఏ బిల్లులైనా చట్ట రూపం దాల్చాలంటే అందుకు రాజముద్ర పడేది గవర్నర్ సంతకం తోనే. మరి ఆ గవర్నర్ సంతకానికి వెలకట్టాడు  భారత వ్యాపార సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా ఏలిన ధీరుబాయ్ అంబానీ సుపుత్రుడు అనిల్ అంబానీ.

 రాఫెల్ స్కామ్లో ప్రపంచవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్న అనిల్ అంబానీ కి సంబంధించి మరో సంచలనం బయటపడింది. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, అనిల్ అంబానీ స్కామ్ గుట్టును బయట పెట్టాడు. గతంలో జమ్ము కాశ్మీర్ గవర్నర్ గాను పని చేశారు. ఆ టైంలో అనిల్ అంబానీ గ్రూప్  కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫైల్ ఒకటి తనవద్దకు వచ్చిందని, ఆ ఫైలుపై సంతకం పెడితే తనకు 150 కోట్ల లంచం ఇస్తామని చెప్పినట్లు సంచలన విషయాలు వెల్లడించారు సత్యపాల్ మాలిక్. ఆ ఫైల్ వెనక స్కాం దాగి ఉందని, ప్రభుత్వ కార్యదర్శులు తమకు తెలియజేశారని, ఆ ఫైలుపై సంతకం చేస్తే మీకు 150 కోట్ల లంచం ఇస్తారని ఆ కార్యదర్శి లో తనకు చెప్పారని వెల్లడించారు . ఆ దస్త్రాన్ని తాను వెనక్కి పంపారన్నారు. కాశ్మీర్ కు తాను ఐదు జతల కుర్తా పైజామా లతోనే వచ్చానన్నారు. వాటితోనే వెళ్లిపోతానని తాను వారికి జవాబిచ్చానని అన్నారు . అలాగే తన పదవినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఆ ఫైల్పై  సంతకం చేయబోనని ప్రధాని నరేంద్ర మోడీకి తెగేసి చెప్పానని చెప్పారు. అవినీతి పై రాజీ పడాల్సిన అవసరం లేదని ప్రధాని కూడా తన చర్యను సమర్థించారని వెల్లడించారు. అనిల్ అంబానీ నేనే కాదు ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ఫైల్ ని కూడా తన సంతకం కోసం పంపారని గుర్తుచేసుకున్నారు మాలిక్. ఆ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాటి టిడిపి, బి.జె.పి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారన్న మాలిక్, అంతేకాకుండా ప్రధానికి చాలా  దగ్గర మనిషినని కూడా తనకు  ఆ వ్యక్తి చెప్పారని అన్నారు. ఆ ఫైల్ వెనక కుంభకోణం ఉందని దానిపై సంతకం చేస్తే 150 కోట్ల లంచం ఇస్తారని కార్యదర్శులు తనకు తెలియజేశారని వెల్లడించారు. ఆ పైల్ ను సైతం తాను వెనక్కి పంపినట్లు తెలిపారు.  రోషిని పథకం అంటే పండిట్లు వదిలేసిన ఆస్తులను కాశ్మీర్ లోని ముస్లింలకు నామమాత్రపు ధరల కు కట్టబెట్టడం. నాటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొత్తానికి సత్యపాల్ ఆరోపణలు మెహబూబా ముఫ్తీ ని, అనిల్ అంబానీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక  బ్యాంకులకు అనిల్ అంబానీ ఐపి పెట్టారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా గవర్నర్ అవినీతి ఆరోపనులు చేయటం అనిల్ అంబానీ పరువు ను మరింత మసకబార్చింది. అయితే సత్యపాల్ మాలిక్ చెప్తున్న దాంట్లో సత్యమెంతో అసత్యమెంతో ఏవేవి దాచారో పైవాడి కెరుక అంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. లంచం ఇవ్వజూపితే అప్పుడే ఎందుకు చెప్పలేదని కేసు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: