మనదేశంలో ఎన్నికలంటే చాలు.. డబ్బులు భారీగా ఖర్చు కావాల్సిందే.. ఏ ఎన్నికలైనా మందు మాత్రం ఏరులై పారాల్సిందే.. ప్రజలకు కానుకలు ఇవ్వాల్సిందే.. ఎంత పెద్ద పార్టీ అయినా.. చిన్న పార్టీ అయినా.. కానుకలు ఇవ్వనిదే ప్రజలు కనికరించరు.. డబ్బులు పంచకపోతే ఎన్నికలు జరిగే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఓటు వేయాలంటే కచ్చితంగా నోటు చేతిలో పెట్టాల్సిందే.. నేటి రోజుల్లో జరిగే ఎన్నికలు అంతలా మారిపోయాయి.. కనీసం ప్రచారానికి రావాలన్నా బిర్యానీ పొట్లాలు, సాయంత్రానికి మందు పోయకపోతే ఎవరూ వచ్చే పరిస్థితి కూడా లేదు. అంతలా మారిపోయాయి నేటి తరం ఎన్నికలు.. అయితే ఇలా ఎన్నికలలో పోటీచేయాలంటే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది.

తాజాగా తెలంగాణలోని హుజూరాబాద్ లో జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చవుతోంది. ఎన్నికలు ఏవయినా ఓట్లు కొనుగోలు చేయందే నాయకులకు గెలుపు ధీమా ఉండదు. అందులోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికలను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు కాస్ట్ లీ గా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకమునుపే.. ఈటల తన ప్రచారంలో గోడ గడియారాలు పంచుకుంటూ వెళ్లారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రెండు పార్టీలు పోటా పోటీగా ఖర్చు పెడుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ఖర్చు బాధ్యతను కొంతమంది స్థానిక నేతలకు కేసీఆర్ అప్పగించారు.

అయితే ఫైనల్ గా ఈటలకే ఈ ఎన్నికల్లో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎన్నికల ఫండ్ విషయంలో బీజేపీ నుంచి ఆయనకు అసలు సహకారం లేదట. అందుకే ఆయన సోలోగా తన గెలుపుకోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. అధికార పార్టీతో పోలిస్తే.. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీగానే ఖర్చు చేస్తున్నారని హుజూరాబాద్ లో టాక్ వినిపిస్తోంది. ఈటెల ఎంతలా ప్రచారం చేసున్నా.. ఓటు వేయాలంటే మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని అక్కడి నాయకులు చెప్పుకుంటున్నారు. ఈటెల పరిస్థితి ఇలా ఉండగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం పథకాలపైనే ఎక్కువగా నమ్మకాలు పెట్టుకుంది. డబ్బు కంటే ముఖ్యంగా పథకాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఖర్చు విషయంలో దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. ఫైనల్ గా గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. బీజేపీ అభ్యర్థి ఈటలే ఖర్చు విషయంలో వెనకడుగు వేయలేని పరిస్థితి. పార్టీకాదు, కేసీఆర్ కాదు, తానే గొప్ప అని నిరూపించుకోవాలంటే ఈటల గెలవాల్సిందే. అందుకే ఆయన ఎన్నికల కోసం చెమటోడుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: