తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మరో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తో  కొట్లాడే దమ్ము లేక కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ లు ఒక్కటయ్యాయని నిప్పులు చెరిగారు హరీష్‌ రావు. నమ్మకాల పార్టీ టీఆర్ఎస్ పార్టీ కి  అబద్దాల పార్టీ బీజేపీ కి మధ్య పోటీ నెలకొందని మంత్రి హారీష్‌ రావు వెల్లడించారు.  ఇది న డుమంతరపు ఎన్నిక  అని...  ఎవరు గెల్చినా రెండేళ్ల నాలుగు నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటరని గుర్తు చేశారు మంత్రి హారీష్‌ రావు. 

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని కాదని ఎన్నిక జరుగుతుందా.. ఈటల రాజీనామా చేసింది రాజకీయ స్వార్థంతోనని నిప్పులు చెరిగారు మంత్రి హారీష్‌ రావు.  అన్నం పెట్టిన చేతికి ఈటల రాజేందర్‌ సున్నం పెట్టిండు... పెంచి పెద్ద చేసిన సీఎంను గుండెల మీద తన్నిండని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు హరీష్‌ రావు. బీజేపీ పార్టీ  ఎం చేసిందని... ఎమైనా చక్కదనం ఉందా... అందుకే అబద్దాల బీజేపీ, జూటా మాటల బీజేపీ. బట్టే బాజ్ బీజేపీ అని. నేను ఊర్కె అనలేదని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌ రావు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  కేవలం తన ఆస్తులను మరియు తాను చేసిన తప్పుల నుంచి బయట పడేందుకే భారతీయ జనతా పార్టీ లో కి వెళ్లాడని నిప్పులు చెరిగారు హరీష్‌ రావు.  కాబట్టి హుజు రా బాద్‌ నియోజక వర్గ ప్రజలు...  అంతా ఆగం కాకుండా.. గప్ప గుత్తగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ... కారు గుర్తు కే ఓటు వేయాలని కోరారు హరీష్‌ రావు.  టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తేనే...  హుజురాబాద్‌ నియోజక వర్గం లో అభివృద్ధి చక్కగా జరుగుందన్నారు హరీష్‌ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: