ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి ఇప్పుడిప్పుడే సెగ‌లు మొద‌ల వుతున్నాయి. ఈ రెండున్న రేళ్ల‌లో ఆయ‌న ఏక‌చ‌క్రాధిప‌త్యంగా పాల‌న కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఆయ‌నకు శత్రువులు పెరుగుతున్నారు. వారంతా కూడా అత్యంత‌ ప్రమాదకరమనే చెప్పాలి. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే త‌మ‌కు శ‌త్రువులు అని చూస్తూ వ‌స్తున్నారు. అందుకే వీరిద్ద‌రినే టార్గెట్ గా చేసుకుని మాత్ర‌మే జ‌గ‌న్ రాజ‌కీయం కొన‌సాగుతూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు వీరితో పాటు జ‌గ‌న్ కు మ‌రింత మంది శ‌త్రువులు యాడ్ అవుతున్నారు.

జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు. అందుకే ఆయ‌న చంద్రబాబు విమర్శలను అస్సలు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ అంటే జ‌గ‌న్ కు ముందు నుంచి కూడా పిచ్చ లైట్‌. అస‌లు ప‌వ‌న్ వైపు కూడా చూడ‌రు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ కు, వైఎస్ ఫ్యామిలీకి అభిమానులుగా ఉన్న వారు కూడా జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఉండ‌వ‌ల్లి లాంటి వారు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇటీవ‌ల కాలంలో ఏకి పారేస్తున్నారు.

ఇక నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ లోనే ఉన్న మ‌రో సీనియ‌ర్ నేత‌, మా జీ మంత్రి డీఎల్‌. ర‌వీంద్రా రెడ్డి లాంటి వాళ్లు సైతం ఇప్పుడు జగన్ వ్యతిరేక గళం విప్పారు. డీఎల్ అవుట్ డేటెడ్ అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆయ‌న కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంలో సీనియ‌ర్ నేత‌.. పైగా జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన లీడ‌ర్‌. అది అక్క‌డ ఎఫెక్ట్ చూపుతోంది. ఇక వైఎస్ ఆత్మ గా చెప్పుకునే మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కెవీపీ రామ చంద్ర రావు సైతం జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా తెర చాటుగా చాలా ప్లాన్లే వేస్తున్న‌ట్టు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరితో పాటు మ‌రి కొంద‌రు నేత‌లు సైతం జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్నారు. జ‌గ‌న్ వీరిపై ఓ క‌న్నేసి ఉంచ‌క‌పోతే కొంప కొల్లేరు అయ్యేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: