బిజెపి నేత ఈటల కు అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రచారం చేస్తోందా అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. రీసెంట్ గా మంత్రి  కేటీఆర్,రేవంత్ రెడ్డి, ఈటెల   భేటీ అయ్యారని అనడం అదేదో తమకు మాత్రమే తెలిసిన రహస్యం అన్నట్లుగా వీళ్ళ భేటీతో తెలంగాణ రాష్ట్రానికి ఏదో  నష్టం జరిగిపోతుంది అన్నట్లుగా ఉన్నాయి మంత్రి మాటలు. మరి ఈటెల తమకు ప్రత్యర్థి కాదని సీఎం కేసీఆర్ తో సహా ఆ పార్టీ నేతలు అంతా అంటున్న మాటలివి. అలాంటప్పుడు ఈటెల గురించి ఈ ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారు.

హుజరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పొద్దున లేచిన దగ్గరనుంచి రాత్రి ప్రచారం ముగిసేదాకా ఈటెల పై ఆరోపణలు, విమర్శలు చేయడమే టిఆర్ఎస్ పనిగా పెట్టుకోవడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన, ప్రవేశ పెట్టబోతున్న పథకాల గురించి చెప్పుకోవడం వదిలేసి ఎంతసేపు ఈటెల గురించి మాట్లాడటం చూస్తుంటే అసలు ఈటల కు టిఆర్ఎస్ ప్రచారం చేస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికితోడు ఈటెల,రేవంతు లు రహస్య భేటీ అనే మాటలు కేటీఆర్ నోటి వెంట రావడం సబబు కాదనే వాదన వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి, ఈటెల మాట్లాడుతూ అవును తామిద్దరం కలుసుకున్నామని అందులో తప్పేముందని కేటీఆర్ ని ఎదురు ప్రశ్న వేశారు. దీనికి కేటీఆర్ దగ్గర సమాధానం లేదు. అసలు ఈటెల, రేవంత్ కలిస్తే ఏంటి? కలవకపోతే ఏంటి? దీనివల్ల కేటీఆర్ కు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు గాని ఏమైనా నష్టమా అని అంటున్నారు విశ్లేషకులు. ఇక రేవంత్, ఈటెల బేటీ గురించే టిఆర్ఎస్ నేతలంతా మూడు రోజులుగా ఒకటే గోల చేస్తున్నారు.

తమ పార్టీ గురించి,తమ ప్రభుత్వం గురించి  జనాలకు చెప్పుకోకుండా ఈటెల, రేవంత్ ప్రస్తావన ఏంటో అని అర్థం కావడం లేదు. ఏదోవిధంగా ఈటెల ను బద్నాం చేయాలని టిఆర్ఎస్ ఈటల కు బాగా ప్రచారం చేసి పెడతానని పలువురు అంటున్నారు. దీంతో ఈటెల ను గెలిపించేది టిఆర్ఎస్ పార్టీనే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందనే తీరుగా మారింది టిఆర్ఎస్ పరిస్థితి. ఈటెల పై ఆరోపణలు చేసే  నేపథ్యంలో  గులాబీ పార్టీ చిక్కుల్లో చిక్కుకుంది. మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి తమ పార్టీ గురించి ప్రచారం చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: