తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సోమవారం హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున జ‌ర‌గ‌నుంది. అయితే ఈ ప్లీన‌రీ వేళ ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పార్టీలో కీల‌కంగా ఉన్న మంత్రి హ‌రీస్ రావుకు ఈ ప్లీనరీకి ఆహ్వానం లేదు. కేసీఆరే స్వ‌యంగా ఆయ‌న‌కు ఆహ్వానం పంప‌వ‌ద్ద‌న్న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అయితే ఇది కాస్త షాకింగ్ గానే ఉన్నా నిజం. కేవ‌లం హ‌రీష్ రావు కు మాత్ర‌మే కాదు.. హుజురాబాద్ ఉప ఎన్నికల పనులు చూసుకుంటున్న పార్టీ నేత‌ల‌ను ఎవ్వ‌రిని కూడా ఈ ప్లీన‌రి కి పిల‌వ‌డం లేద‌ట‌. కేసీఆరే స్వ‌యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అంద‌రూ కూడా ఈ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం , ఇత‌ర ప‌నుల్లో బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఒక్కో గ్రామానికి ఇద్ద‌రేసి ఎమ్మెల్యే ల‌ను ఇన్ చార్జ్ లుగా పెట్టారు. దీంతో టీఆర్ ఎస్ లో ఉన్న ఎమ్మెల్యే ల్లో చాలా మంది అక్క‌డే మ‌కాం వేసి మ‌రీ త‌మ‌కు అప్ప‌గించిన గ్రామాల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌చారం పీక్ స్టేజ్ కు చేరుకుంటోన్న వేళ వారిని అక్క‌డ నుంచి ప్లీన‌రి కోసం ర‌ప్పిస్తే ఇబ్బంది అవుతుంద‌నే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

ఇక హుజూరా బాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30నే జరగనున్నందున అక్క‌డ అధికార పార్టీ నేత‌లు మంత్రి హ‌రీష్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌చారం ముమ్మ‌రంగా చేస్తున్నారు. వీరంతా ప్లీన‌రీ కి వ‌స్తే హుజూరా బాద్ లో యాక్టివిటీ స్లో అవుతుంద‌ని కొంద‌రు నేత‌లు కేసీఆర్ కు చెప్ప‌డంతోనే ఆయ‌న వారికి ఆహ్వానాలే పంప వ‌ద్ద‌ని అన్నార‌ట‌. ఇదిలా ఉంటే ప్లీన‌రికి వ‌చ్చే వారి సంఖ్య ను కూడా చాలా ప‌రిమితం చేశారు. ముందు కేవ‌లం పదిహేను వేల మంది తో నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. తర్వాత కేసీఆర్ కేవలం ఆరు వేల మందితోనే ప్లీన‌రీ నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: