కొన్ని రాష్ట్రాలలో కాస్త గ్యాప్ ఇచ్చిన కరోనా ఇంకొన్ని రాష్ట్రాలలో ప్రజలపై పగబట్టినట్టు వారిని ఇబ్బంది పెడుతోంది.  ఇప్పటికీ వందలాది మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంలో కంటే ఈసారి యువత ఎక్కువగా  కరోనా బారిన పడి మరణించారు. నిజానికి మనకు మాస్క్, శానిటైజర్ ల  గోల ఇప్పట్లో ఆగదని మరో వైపు ఆరోగ్య నిపుణులు కరోనా ఇంకా ఉంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. వివరాల్లోకి వెళితే కొన్ని రాష్ట్రాలలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే కేరళ వంటి రాష్ట్రాలలో మాత్రం కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. అక్కడి ప్రజలు అర చేతిలో ప్రాణాలను పెట్టుకుని జీవిస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 8538 కేసులు నమోదు కాగా, వారిలో 75 మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉదృతి కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా తక్కువగా ఉందని కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఆ నిర్లక్ష్యమే కరోనాకి మళ్ళీ ఆజ్యం పోస్తుందని అంటున్నారు. ప్రమాదం ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా అందరూ మాస్క్ లు , శానిటైజర్ లు తప్పక వాడుతూ జాగ్రత్తలు వహించాలని అంటున్నారు.

జనవరి లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే డిసెంబర్ దాటితే కానీ కరోనా పరిస్థితి ఏమిటా అని అంచనాకు రాలేమని వారు అంటున్నారు. కాబట్టి అందరూ ఇంకా కొంత కాలం  తప్పకుండా కరోనా నియమాలను పాటిస్తూ జాగ్రత్త వహించడం తప్పదంటున్నారు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే కొందరు ఒక డోసు తీసుకుని మనం ఇక సేఫ్ అని అనుకుంటున్నారు. రెండు డోసు వద్దులే అని లైట్ తీసుకుంటున్నారు కానీ నిపుణులు మాత్రం రెండో డోసు తీసుకుని బూస్టర్ డోసు కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: