ఏపీలో అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య ఫైటింగ్ ఓ రేంజ్‌లో న‌డుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఓ రేంజ్ లో న‌డుస్తోంది. పైకి ఎవ‌రికి వారు సై లెంట్ గా ఉంటున్నా లోప‌ల మాత్రం ఎవ‌రికి వారు క‌త్తులు నూరు కుంటోన్న ప‌రిస్థి తే ఉంది. ముఖ్యంగా ప‌ద‌వుల విష‌యంలోనూ, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్యం విష‌యంలో ఎవ్వ‌రూ కూడా వెన‌క్కు తగ్గే ప‌రిస్థితి లేదు.

రాయ‌ల‌సీమ‌లో నాలుగు జిల్లాల్లో నూ అధికార పార్టీ నేత‌ల ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మామూలుగా లేదు. ఓ వైపు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ఆయ‌న సొంత జిల్లాలో జీరో చేసే టార్గెట్ తో ప‌ని చేస్తుంటే.. ఇప్పుడు అదే చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేత‌లు కుమ్ములాట‌ల‌కు దిగుతున్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పుంగనూరు ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి జగన్ స‌న్నిహితుడు అయిన మంత్రి పెద్దిరెడ్డి కుప్పం నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో ఆధిప‌త్య పోరుకు దిగుతున్నారు.

ఎంపీ రెడ్డ‌ప్ప దూకుడు మంత్రి పెద్దిరెడ్డికి రుచించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక న‌గ‌రిలో ఎమ్మెల్యే రోజా కు కేజే కుమార్ కు ప‌డ‌డం లేదు. న‌గ‌రిలో ఎమ్మెల్యే రోజా కు వ్య‌తిరేకంగా ఉన్న బ‌ల‌మైన వ‌ర్గాల‌కు జిల్లా మంత్రులే స‌పోర్ట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇక శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే మ‌ధుసూద‌న్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి కూడా ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. అటు మ‌ద‌న‌ప‌ల్లిలో ఎంపీ  మిథున్ రెడ్డి జోక్యం పై ఎమ్మెల్యే మండి ప‌డుతున్నార‌ట‌.

ప‌ల‌మ‌నే రులో కొత్త‌గా ఎమ్మెల్యే గా గెలిచిన వెంక‌టే గౌడ కు పాత నేత‌లు, సీనియ‌ర్ల‌కు ప‌డ‌డం లేదు. పీలేరు లో ఎమ్మెల్యే ను చింత‌ల‌ను కొంద‌రు టార్గెట్ గా చేసుకుని రాజ‌కీయం చేస్తున్నారు. ఇలా దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ ఆధిప‌త్య పోరు ఉండ‌డం ఇప్పుడు పార్టీ పెద్ద‌ల‌కు త‌ల‌నొప్పి గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: