అభివృద్ధి ఉన్నా లేకున్నా ప‌ట్టించుకోని స్థితిలో ఆంధ్రా ప్ర‌జ‌లు లేరు. అభివృద్ధి ఉంటేనే న‌లుగురికి ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయి అనే స్పృహ‌లోనే ఉన్నారు. డ‌బ్బులు పంచాం క‌నుక ప‌థ‌కాలు అమ‌లు చేశాం క‌నుక గెలుపు మాదే అంటే కుద‌ర‌ని ప‌ని. అందుకు చె ప్పిన కార‌ణాలు, చెప్ప‌బోయే కార‌ణాలు ఎలా ఉన్నా కూడా అవ‌న్నీ కామెడీగానే ఉంటాయి. అయినా కూడా జ‌గ‌న్ ను ప్ర‌జ‌లు ఎందుకు మ‌ళ్లీ న‌మ్మాలి. ఏడాదికి ల‌క్ష కోట్ల రూపాయ‌లు సంక్షేమానికి కేటాయించ‌మ‌ని ఎవ‌రు చెప్పారు? ఎందుకు చెప్పారు? అంత‌టి స్థాయిలో నిధులున్నాయ‌ని జ‌గ‌న్ ఎలా అనుకున్నారు? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లు.. వీటికి సంబంధించి ఇంకా కొన్ని జ‌వాబులు వెతుక్కోవాలి.

ఇక పారిశ్రామిక ప్ర‌గ‌తి అన్న‌ది రాష్ట్రంలో లేద‌న్నది వాస్త‌వం. ఏ కొద్దిపాటి అవ‌కాశాలు ఉన్నా కూడా అవేవీ రాకుండానే పోతున్నాయి. ద‌క్క‌కుండానే పోతున్నాయి. అభివృద్ధికి సంబంధించి ఏ పాటి నిధులూ కేటాయించ‌లేని ప్ర‌భుత్వం ఇక పారిశ్రామీక‌ర‌ణ‌కు సంబంధించి ఎలా స్పందిస్తుంద‌ని? చంద్ర‌బాబు హ‌యాంలో ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చి కాస్తో కూస్తో ఉపాధి ఇచ్చాయి. క‌నుక ఆయ‌న పేరు ఈ విష‌య‌మై మ‌ళ్లీ వినిపిస్తుంది. ఇండ‌స్ట్రియ‌ల్ పాలసీల‌కు సంబంధించి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలేవీ అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. మంత్రి గౌత‌మ్ వీటిపై ఎంత దృష్టి పెడుతున్నా ఆర్థిక అస్థిర‌త‌లో ఉన్న ప్ర‌భుత్వం త‌మ‌కు ఏ విధంగానూ అండ‌గా ఉండ‌ద‌న్న అభిప్రాయంలో పారిశ్రామిక వ‌ర్గాలు ఉన్నాయి.

ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు మాత్రం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశ‌గా న‌డ‌ప‌గ‌ల‌ర‌న్న విశ్వాసం అంతటా విస్తోంది. జ‌గ‌న్ భ‌క్తులు కూడా కొంద‌రు ఇదే విష‌యాన్ని అంగీక‌రిస్తున్నారు. మూడు రాజ‌ధానుల డైలమా కార‌ణంగానే తాము అనుకున్న విధంగా ప‌నిచేయలేక‌పోతున్నామ‌ని ఒప్పుకున్నారు కూడా! ఈ ద‌శ‌లో చంద్ర‌బాబు వ‌స్తే కాస్త‌యిన ప‌రిస్థితులు మారుతాయ‌ని అంటున్నారు ఇంకొంద‌రు. చంద్ర‌బాబు హ‌యాంలో క‌న్నా జ‌గ‌న్ హ‌యాంలోనే పంచిన డ‌బ్బు ఎక్కువ అని.. వీటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉన్నా లేక‌పోయినా ఉపాధి అన్న‌ది ఎవ్వ‌రికీ ద‌క్కకుండా పోయింద‌న్న‌ది ప‌రిశీల‌కుల వాద‌న. ఇప్పుడివే జ‌గ‌న్ కొంప ముంచ‌నున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp