ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మండిప‌డ్డారు. కొట్టెది వాళ్లే కేసులు పెట్టేది కూడా వాళ్లేన‌ని అన్నారు. నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేస్తే టీడీపీ 1 శాతం తిడితే వైసీపీ 99 శాతం బూతులు మాట్లాడిన‌ట్టు తెలుస్తుంద‌న్నారు. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాల‌యంపై దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు నారాయ‌ణ‌. కేంద్ర ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర నుంచి త‌డా వ‌ర‌కు ఉన్న అన్నిఅదానీల‌కు అప్ప‌జెప్ప‌డం వ‌ల్ల అక్ర‌మంగా గంజాయి, హెరాయిన్ స‌ప్లే అవుతుంద‌ని ఆరోపించారు. అలాగే అక్ర‌మ ర‌వాణాకు అడ్డాగా మారింద‌న్నారు.


     మీడియా స‌మావేశంలో సీపీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మాట్లాడారు. తిట్లు తిట్లుకోవ‌డం స‌రే పార్టీల‌కార్యాల‌యాల‌పై దాడి చేయ‌డం ఏంట‌ని వైసీపీ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికార ప‌క్షంలో శాశ్వ‌తంగా ఉంటారా.. ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఏమ‌వుతుందో ఆలోచించాల‌న్నారు. పార్టీ కార్యాల‌యాల‌పై, ఇండ్ల‌పై దాడి చేయ‌డం సంస్కృతి కాద‌న్నారు. వాదోప‌వాదాల‌న్నయినా చేసుకోండని, తిట్టుకోండి, మీరు ఎంత బూతులు తిట్టుకుంటే అంత మంచిద‌ని నారాయ‌ణ ఎద్దేవా చేశారు. దీనివ‌ల్ల ఎవ‌రు ఎంత వెద‌వ‌లో ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంద‌న్నారు.


   దాడిచేసింది వీళ్లే మ‌ళ్లీ పైగా కేసుకూడా పెట్టార‌ని అన్నారు. రాష్ట్రంలో  రాక్ష‌స‌పాల‌న సాగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవ‌డానికి ఢిల్లీకి పోతున్నార‌, ఆర్టిక‌ల్ 356 ను అమ‌లు చేయాల‌ని కోరేందుకు  వెళ్తున్న‌ట్టున్నార ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడిని ఉద్దేశించి సీపీఐ నారాయ‌ణ అన్నారు. మ‌రోవైపు ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి వివ‌రించేందుకు ఢిల్లీకి బ‌య‌లుదేరారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను క‌లిసేందుకు వెళ్లారు చంద్ర‌బాబు. 2 రోజుల ప‌ర్య‌ట‌న కాస్త మూడు రోజులుగా మారింది. అమిత్ షా కాశ్మీర్‌లో ఉండ‌డం వ‌ల్ల చంద్ర‌బాబుకు అపాయింట్ మెంట్ దొర‌క‌లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: