బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ జనరల్ అబ్జర్వర్ ఐఎఎస్ అధికారి భీష్మ కుమార్ కు బీజేపీ  నేతలు నేడు ఫిర్యాదులు చేసారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపిలు జివీఎల్ నరశింహరావు, సిఎం రమేష్, బీజేపీ  సహా ఇంఛార్జి సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. మా కార్యకర్తలపై  వైసీపీ  తప్పుడు కేసులు భనాయిస్తుంది అని సోము ఆరోపణలు చేసారు. పోలీసులు వారికి తొత్తులుగా మారారు అని మండిపడ్డారు.

స్థానిక పోలీసులతో ఎన్నికలు నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంటుందని ఫిర్యాదు చేసామని చెప్పారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తోత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలను బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. వాలెంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి పై వివరించాం అన్నారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం 15 ప్లటూన్ల పారామిలిటరీ బలగాలను పంపారు అని ఆయన పేర్కొన్నారు.

స్వేఛ్చాయుత వాతావరణం లో ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు అవసరం అన్నారు ఆయన. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు. ఏంజెట్లుగా కూర్చోవడానికి లేకుండా బెదిరిస్తున్నారు అని విమర్శించారు. పారా మిలిటరీ బలగాలతో పేరేడ్ నిర్వహించి ఓటర్లలో నమ్మకం కలిగించాలి అని కోరారు. మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదు అన్నారు. బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారు అని అన్నారు. అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బద్వేల్ లో తిష్ట వేశారు అని వ్యాఖ్యలు చేసారు. ఓటర్లకు విశ్వాసం కలిగించేలా ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంది అని వాలెంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజల్లోకి వస్తే నిలదీస్తారనే సీఎం ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉన్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap