హుజురాబాద్ లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక రోజు రోజు కు అనేక మ‌లుపులు తిరుగుతుంది. అక్క‌డ పోటీ లో ఉన్న ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల‌లో గ‌త కొన్ని రోజుల‌లో నే చాలా మార్పులు సంభవించు కున్నాయి. ప్ర‌తి పార్టీ నుంచి వ‌ల‌స‌లు జ‌రిగాయి. అలాగే ప్ర‌తి పార్టీ ల‌కి చేరిక‌లు కూడా జ‌రిగాయి. నాయ‌కులు పార్టీలు మార‌డం వ‌ల్ల సెకండ‌రీ క్యాడ‌ర్ కొంత మంది ఆయా నాయ‌కుల వెంటే వెళ్ల‌గా కొంత మంది మొద‌టి నుంచి ఉన్న పార్టీ లో నే ఉన్నారు. అయితే ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య ను ప్ర‌తి పార్టీ ఎదుర్కొంటుంది. పార్టీ మారిన వారి స‌న్నిహితులు మొద‌టి పార్టీ లో ఉండ‌టం వ‌ల్ల ఆయా పార్టీ లు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల క‌న్న ముందే పక్క పార్టీల‌కు తెలిసి పోతుంది. దీంతో గొడ మీద పిల్లుల ఉన్న క్యాడ‌ర్ కు నాయ‌కులకు ఈ ఉప ఎన్నిక‌ల‌లో చాలా డిమాండ్ పెరిగి పోయింది.



ఈ స‌మ‌స్య ను ప్ర‌స్తుతం ప్ర‌ధాన పార్టీలు అయిన టీఆర్ ఎస్ బీజేపీ కాంగ్రెస్ లు ఎదుర్కొంటున్నాయి. ముందుగా టీఆర్ ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేంధ‌ర్ బీజేపీ లో ఆయ‌న కు స‌న్నిహితంగా ఉండే కొంత మంది ఇంకా టీఆర్ ఎస్ లోనే ఉన్నారు. అలాంటి వారు టీఆర్ ఎస్ పార్టీ ర‌హ‌స్యంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను బ‌య‌ట‌కు చెబుతున్నారు. అలాగే బీజేపీ లో నుంచి పెద్ద రెడ్డి కాంగ్రెస్ లో నుంచి కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ చేరారు. వారికి స‌న్ని హితంగా ఉండే వాళ్లు ఆయా పార్టీ లో నే ఉండి పోయారు. దీంతో ఈ ఉప ఎన్నిక‌ల కు సంబంధించి ఆయా పార్టీ లు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను లీక్ చేస్తున్నారు. దీంతో ఈ మూడు పార్టీలలో ఎవ‌రు ఎలాంటి వారు ఉన్నారో తెలుసు కోవ‌డానికి నాయ‌కుల‌కు క‌ష్టం గా మారింద‌ట‌. దీంతో ర‌హ‌స్య నిర్ణ‌యాల‌ను పంచు కోవ‌డానికి నాయ‌కులు జంకుతున్నారని స‌మాచారం.





మరింత సమాచారం తెలుసుకోండి: