ఏపీలో అధికార వైసీపీ రాజ‌కీయాలు గ‌త ఎన్నిక‌లు ముగిసి న‌ప్ప‌టి నుంచే వేడెక్కుతూ వ‌స్తున్నాయి. ఇక త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుండ‌డంతో ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది ? ఎవ‌రు కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు వెళ‌తారు ? అన్న దానిపై కూడా పెద్ద స‌స్పెన్స్ నెల‌కొంది. ఇదిలా ఉంటే జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు అయిన వారికి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఉండ‌వ‌నే అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణా క‌ర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుండ‌డం పెద్ద షాకింగ్ గా మారింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమ‌న తాను పోటీ నుంచి త‌ప్పుకుని తన వార‌సుడిని రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా భూమ‌న వార‌సుడు స‌త్తా చాటాడు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎమ్మెల్యే సీటు త‌న వార‌సుడికి ఇవ్వాల‌ని కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌రుణా క‌ర్ ప్ర‌స్తావించార‌ట‌. అయితే అందుకు జ‌గ‌న్ నో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన + టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌న్న ప్ర‌చారం ఉంది.

అదే జ‌రిగితే తిరుప‌తిలో కాపు సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు ఎక్కువుగా ఉండ‌డంతో ఈ సారి ఇక్క‌డ వైసీపీ నుంచి కూడా కాపు వ‌ర్గానికే చెందిన వ్య‌క్తిని రంగంలోకి దింపాల‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్ అట‌. ఇక గ‌తంలో కూడా ఇక్క‌డ నుంచి ఆ సామాజిక వ‌ర్గానికే చెందిన మెగాస్టార్ చిరంజీవి, చదలవాడ కృష్ణమూర్తి, వెంకటరమణ, సుగుణమ్మ గెలిచారు.

అందుకే ఈ సారి జ‌న‌సేన + టీడీపీ క‌లిసి పోటీ చేసినా క్యాస్ట్ ఈక్వేష‌న్ తేడా రాకుండా ఉండేందుకే ఇక్క‌డ క‌రుణా క‌ర్‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్ ? క‌రుణా క‌ర్‌ను ప‌క్క‌న పెడితే ఆయ‌న‌కు ఈ సారి ఎమ్మెల్సీ ఇస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: