టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పార్టీకి చెందిన నేతలతో కలిసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు.. మాట్లాడే స్వేచ్ఛ లేదని చంద్రబాబు అన్నారు. ఎవరైనా సమస్య ఉందంటే దాడి చేసి.. తిరిగి ప్రజలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. రెండేళ్లలో వైసీపీ చేసిన అరాచకాలపై పుస్తకాన్ని రూపొందించామని.. దాన్ని రాష్ట్రపతికి ఇచ్చామని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని.. గంజాయిని అరికట్టాలన్నారు. డీజీపీని రీకాల్ చేయాలని.. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరామన్నారు.

ఏపీలో ఉన్మాదపాలన సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తాము డ్రగ్స్ పై పోరాటం చేస్తుంటే వైసీపీ ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేసిందని ఆరోపించారు. పోలీసులే ఈ దాడులు చేయించి.. సురక్షితంగా వాళ్లను పంపించారని చెప్పారు. తమ ఆఫీసు పక్కనే సీఎం ఇల్లు, డీజీపీ ఆఫీసు, బెటాలియన్ ఉన్నాయన్నారు. అయినా దాడి జరిగిందని చెప్పారు. రాజ్యాంగబద్ద సంస్థలపైనా దాడులు చేస్తున్నారని.. హైకోర్టు న్యాయమూర్తులను దుర్భాషలాడుతున్నారని చెప్పారు.

ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా.. దాని చిరునామా ఏపీ అని పోలీసులు చెబుతున్నారన్నారు. ఏజెన్సీ ఏరియాలో 25వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లిక్కర్ బ్రాండ్లు జగన్ తెచ్చారని.. మద్యపాన నిషేధం అని చెప్పి 3, 4 రెట్లు ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.


ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రపంచమంతా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ పై ఆసక్తిగా ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పుత్రరత్నం మాత్రం ఏపీలో సంక్షేమ పథకాలను ఎలా అడ్డుకోవాలి..? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎలా చెడగొట్టాలి?  కులాల మధ్య కుంపటి ఎలా రగిలించాలి ? ఇదే ఆలోచన. ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: