ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం కొత్త ఉత్తరువు జారీచేసింది. అదేమంటే, కట్నం లెక్క చెప్పాలంట. దాదాపు 2004 నుండి ఎవరెవరు ఎంత కట్నం తీసుకున్నది ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్పాలని అందరికి నోటీసులు జారీచేసింది యోగి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఈ తరహా నోటీసులు అందరిని ఆకర్షిస్తున్నాయి. వరకట్న వ్యవస్థను రూపుమాపేందుకు యోగి ప్రభుత్వం కంకణం కట్టుకుందట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అందుకే 2004 నుండి జరిగిన వివాహాలలో ఎంతమంది ఉద్యోగులు కట్నకానుకలు తీసుకున్నారు, వాటి విలువ ఎంత అనే వివరాలు ప్రభుత్వానికి తెలపాల్సింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఈ తరహా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12నే దీనికి సంబందించిన మార్గదర్శకాలు కూడా ఇచ్చారట. యూపీలో వివిధ శాఖలలో దాదాపు పదివేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ వారి శాఖ అధిపతుల ద్వారా ఆయా సమాచారాన్ని ప్రభుత్వానికి అందచేయాలని ప్రభుత్వం సూచించింది. పెళ్లి అయిన ఏడాది, అప్పటి వారి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పెళ్లి సందర్భంగా తీసుకున్న కట్నం(అవి గిఫ్ట్ ల పేరుమీద ఇచ్చినా సరే) వివరాల తో సవివరంగా సమాచారం ఉండాలట. యూపీ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ తరహా నిబంధనలు తెచ్చింది. వాళ్ళే కదా ప్రభుత్వ ఉద్యోగం ఉంది అనే పేరుతో ఎక్కువ వరకట్నం గుంజేది, అందుకే ముందు వాళ్ళ మీద పడ్డట్టున్నాడు యోగి.

ఈ నిబంధన ప్రకారం డి ఫారం సమర్పించాల్సి ఉంటుందట. ప్రతి ఒక్కరు వివాహ సమయంలో కట్నం తీసుకున్నారా, తీసుకుంటే ఎంత తీసుకున్నారు, ఏయే రూపాలలో తీసుకున్నది వివరంగా దానిలో తెలపాల్సిందే.  ఏప్రిల్ 31, 2004 తరువాత వివాహం అయిన ప్రతి ఉద్యోగి ఈ తరహా డిక్లరేషన్ ఇచ్చితీరాల్సిందే. ఎవరైనా నిబంధన తప్పితే శాఖాపరమైన చర్యలు తప్పవట. 1999లో వరకట్న చట్టం వచ్చినప్పటికీ ఇంతవరకు ఆ దురాచారాన్ని రూపుమాపలేకపోయిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండబోదని యోగి సర్కార్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: