టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం నేడు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ని కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. ఈ ఘటనలపై రాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం. మీరు చెప్పినవన్నీ చాలా సీరియస్ అంశాలు... అని తెదేపా రాష్ట్రపతి అన్నారని సమాచారం. వీటన్నింటిని పరిశీలనకు తీసుకుంటానన్న రాష్ట్రపతి... అమరావతి రాజధాని ఏమైంది? అని టీడీపీ బృందాన్ని రాష్ట్రపతి అడిగారని తెలుస్తుంది. అమరావతి నిర్మాణం కు సంబంధించి టీడీపీ ని అడిగారట.

అయితే అమరావతి నిర్మాణం ఆగిపోయిందని అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సమాచారం. 30 నిముషాలకు పైగా రాష్ట్రపతి తో  ఏడుగురు సభ్యుల టీడీపీ బృందం సమావేశం అయింది. రాజమండ్రి శిరోముండనం కేసు విషయాన్ని వివరించిన తెదేపా నేతలు... మీరు ఆదేశించినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇక భేటీ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ 8 పేజీల లేఖను అధరాల తో సహా రాష్ట్రపతి కి అందజేసాము అని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో  లిక్కర్ ,డ్రగ్స్ మైనింగ్, సాండ్,  మాఫియా విస్తరించింది అని ఆయన ఆరోపణలు చేసారు.  న్యాయ, మీడియా సహ అన్ని వ్యవస్థల పైన దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. రాష్ట్రపతి నీ టీడీపీ బృందం తరపున  నాలుగు ప్రధాన డిమాండ్స్ కోరాము అని తెలిపారు. 1.ఏపీ లో  మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి అని డిమాండ్ చేసారు. 2.రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి  అని 3.అక్టోబర్ 19న జరిగిన ఘటనలపై  సిబిఐ విచారణ జరిపించాలి అని  4. అధికారపార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీ నీ రీకాల్ చేయాలని రాష్ట్రపతి నీ కోరాము అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి దాడులు, రాజకీయాలు లేవు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: