రాష్ట్ర ప్రేరేపిత ఉగ్రవాదం పై రాష్ట్రపతికి వివరించాము అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏజెన్సీలో 25 వేల ఎకరాల్లో 8,వేల కోట్ల రూపాయల గంజాయి సాగు అవుతుంది అని ఆయన ఆరోపించారు. ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తో దానికి సంబంధం ఉంది అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుండి డ్రగ్స్ సరఫరా , ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి అన్న చంద్రబాబు... రాష్ట్రంలో మద్యపాన నిషేధం అంటూ, తక్కువ నాణ్యత గల మద్యం అమ్ముతున్నారు అని పేర్కొన్నారు.

డ్రగ్స్, గంజాయి అమ్మకాలతో రాష్ట్రంలో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతుంది అని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రం వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు గంజాయి , డ్రగ్స్ అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది అని ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసుల సహకారంతో మా పార్టీ కార్యాలయాలు, నేతల పై దాడులు జరిగాయి అని ఆయన తెలిపారు. గడచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అని చంద్రబాబు విమర్శలు చేసారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు చంద్రబాబు నాయుడు.

ప్రత్యేక జీవో ద్వారా మీడీయా పై దాడులు జరుగుతున్నాయి. ప్రలోభాలు, దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. 41 ఎ ద్వారా అరెస్ట్ లు చేయడం జరుగుతున్నాయి అన్నారు చంద్రబాబు. మానసికంగా ప్రతిపక్ష నేతల పై దాడులు జరుగుతున్నాయి అని విమర్శించారు. చివరికి పార్లమెంటు సభ్యులపై కూడా పోలీసులు చేయి చేసుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవు అని... కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతుంది అన్నారు ఆయన. కేసులతో వేధింపులు జరుగుతున్నాయి అని ఆరోపణలు చేసారు. రాష్ట్రప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారు అని విమర్శలు చేసారు. రాష్ట్రంలో 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలనతో పాటు, సీబీఐ చేత దర్యాప్తు జరపాలని కోరాము అన్నారు. ప్రధాన మంత్రిని అలాగే హోం మంత్రిని కలుస్తామని అన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: