రాష్ట్రపతి పాలన ఏపీకి కావాలి. ఇది రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం డిమాండ్. రాష్ట్రపతిపాలన పెట్టాలని కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఏపీ అన్ని విధాలుగా భ్రష్టు పట్టిందని కూడా ఆయన చెప్పారు.

చంద్రబాబు కోరినట్లుగా రాష్ట్రపతిపాలన ఏపీలో పెడతారా అన్న చర్చ అయితే ఇపుడు హాట్ హాట్ గా  సాగుతోంది. నిజానికి రాష్ట్రపతిపాలన పెట్టాలి అంటే గవర్నర్ నుంచి నివేదిక రావాలి. కేంద్రం తరఫున ఆయన రాజ్యంగ‌బద్ధమైన బాధ్యతలను రాష్ట్రాలలో  చూస్తారు. ఆయన నుంచి నివేదికను తెప్పించుకున్న మీదటనే కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తుంది. గవర్నర్ ఈ విషయంలో పంపే నివేదిక మీద సంతృప్తి వ్యక్తం కావాలి. అపుడు కేంద్ర క్యాబినేట్ లో చర్చ సాగాలి. దాని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే ఏపీలో 356 అధికరణం అమలు అవుతుంది.

ఇపుడు అంతటి ప్రక్రియ ఏపీ విషయంలో చేస్తారా. అందుకు కేంద్ర పాలకులు సిద్ధంగా ఉన్నారా అన్నది ఒక చర్చ అయితే నిజంగా కేంద్రం పూనుకుని రాష్ట్రపతిపాలన పెడితే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అర్జంటుగా రాష్ట్రపతిపాలన పెడితే అది కచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కే మేలు చేస్తుంది అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు చేసిన డిమాండ్ జగన్ నెత్తిన పాలు పోసినట్లే అని కూడా చెబుతున్నారు. ఇపుడు ఏపీ అప్పుల్లో ఉంది. జగన్ ఇచ్చిన హామీల అమలుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వాన్ని కూలదోస్తే కచ్చితంగా ఈ అప్పుల బాధకు  బిగ్ రిలీఫ్ ఫస్ట్ వస్తుంది.

ఆ మీదట తనను అన్యాయంగా తొలగించారంటూ టూ జనాల్లోకి వెళ్తే ఆ సానుభూతి కూడా తోడై మరో మారు జగన్ కే అధికారం దక్కే సూచనలు ఉన్నాయి. మరి ఇవన్నీ చంద్రబాబుకు తెలియవు అనుకోగలమా. అయితే బాబు దగ్గర కూడా దీనికి మించిన వ్యూహమేదో ఉంటుంటుంది అనుకోవాలి. అంతే కాదు ఏపీలో 2014 పొత్తులను కలిపితే వైసీపీ ఓడుతుంది అన్న అంచనాలు అయినా ఉండాలి. ఏది ఏమైనా జగన్ పట్ల పూర్తిగా ప్రజా వ్యతిరేకత ప్రబలక ముందే ఆయన్ని దించేస్తే మాత్రం ఆ నింద కానీ బండ కానీ టీడీపీ మీదనే పడుతుంది అన్నది రాజకీయ విశ్లేషణ. ఇంతకీ రాష్ట్రపతి పాలన ఏపీలో పెడతారా. వెయిట్ అండ్ సీ.




మరింత సమాచారం తెలుసుకోండి: