లోయ‌లోని ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడుతాం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తొల‌గించండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సాహోసోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌మ్మూకాశ్మీర్‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. సోమ‌వారం శ్రీ‌న‌గ‌ర్‌లో బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగం చేయ‌డానికంటే ముందు సెక్యూరిటీ అధికారుల‌ను ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు అమిత్ షా ప్ర‌సంగించే స్థలంలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూప్ గాజు షీల్డ్‌ను తొల‌గించారు.   మీ హృదయంలో ఉన్న భయాన్ని అంద‌రూ తొలగించుకోవాలని సూచించారు.  ఇకపై శాంతి, అభివృద్ధి ప్రయాణానికి  అంతరాయం కలిగించదన్నారు. ప్రతిపక్షాలను హేళన చేస్తూ కొన్ని కామెంట్లు చేశారు. బుల్లెట్లకు భయపడకుండా తాను కాశ్మీర్‌లో పర్యటించినట్టు తెలిపారు. స్టేజ్‌ మీద కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాస్‌ను తీసేయాలని చెప్పినట్టు తెలిపారు. కాశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా అంటున్నారని తెలిపారు.  దీనికి తాము అంగీకరించడం లేదన్నారు. కాశ్మీర్‌ సమస్యలపై ప్రజల తోనే ఎన్నిసార్లు చర్చలు జరపడానికైనా కేంద్రం సిద్దంగా ఉందన్నారు.

 అమిత్ షా మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనకు చివరి రోజు అయిన సోమ‌వారం శ్రీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో అమిత్‌షా మాట్లాడారు.  కొందరు నాయకులు నన్ను నిందించారని అమిత్ షా  పేర్కొన్నారు.  నేను మీతో ముక్తసరిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అందుకే  బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్ లేదా భద్రత అవసరం లేదని, ఫరూక్ సాహబ్ పాకిస్తాన్‌తో మాట్లాడమని సూచించారు. అయితే నేను మాట్లాడుతాను పాకిస్తాన్‌తో కాదు లోయలోని ప్రజలతో మాట్లాడుతానని  తనదైన శైలిలో స‌మాధానం చెప్పారు అమిత్ షా.

మీ చేతుల్లో రాళ్లు పట్టుకోండని చెప్పినవారు మీకు ఏమి మంచి చేశారో చెప్పాలని  యువతను ఆయన ప్రశ్నించారు. లోయలోని యువతను కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పీఓకే  మీ దగ్గర ఉంది. మీ ద‌గ్గ‌ర‌ ఇప్పుడు ఆయుధాలు, రాళ్లు ఉన్నాయి. మీ గ్రామాల‌కు  విద్యుత్ ఉందా..? ఆసుపత్రి ఉందా..? మెడికల్ కాలేజీ ఉందా..? కనీసం తాగేందుకు మంచి నీరు ఉందా..? మహిళలకు మరుగుదొడ్లు ఉన్నాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు.  ఆగస్టు 5న  ఇంటర్నెట్‌ బంద్‌ చేయకుంటే యువతను రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేసేవారని, కాశ్మీర్ ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోడీ గుండెల్లో కాశ్మీర్ ఉందని.. అందుకే  ఇక్క‌డ అభివృద్ధికి విఘాతం కలిగించే వారు  విజయం సాధించలేరుని పేర్కొన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: