నేడు తెరాస రెండు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ ను మళ్ళీ తమ నేతగా ఎన్నుకుంది పార్టీ. అంటే మళ్ళీ ఆయనే సీఎం అభ్యర్థి. అయితే గతంలో కేటీఆర్ ను రంగంలోకి దింపుతున్నారు అంటూ అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆవిర్భావదినోత్సవం పై అందరు ఆసక్తి చూపారు. కానీ మళ్ళీ కేసీఆర్ ఉండటానికి వెనుక ఉన్న వ్యూహం ఏమై ఉంటుంది అనేది ఇప్పటి చర్చనీయాంశంగా ఈ వేడుక ముగిసింది. తెరాస ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఎప్పుడు ఘనంగా చేసే పార్టీ కరోనా అయినప్పటికీ ఈ సారి కూడా భారీగానే ఏర్పాట్లు చేసింది. కానీ ముందుగా అందరు అనుకున్నట్టుగా కేసీఆర్ సెంట్రల్ కు వెళ్లడం, కేటీఆర్ సీఎం అవడం, హరీష్ లేదా కవిత కేటీఆర్ స్థానంలోకి రావడం లాంటి ఘటనలు జరగకుండానే యధావిధిగా సంబరాలు ముగిశాయి.

దీని వెనుక ఉపఎన్నిక ఇంకా జరగాల్సి ఉండటం ఒక కారణం అయితే, రెండోది వచ్చే సారి కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు కేసీఆర్ ను మళ్ళీ తెరాస పీఠంపై కూర్చోబెట్టాయనే చెప్పాలి. కేటీఆర్ అన్నిటిని నిర్వహించగలడేమో, అప్పుడే బీజేపీని తట్టుకోవడం మాత్రం కుదరని పని అని కేసీఆర్ ముందు ఉంటున్నట్టు ఉన్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అనుకున్న దానికంటే ముందే కేంద్రం లో ఉన్న బీజేపీ జరపాలని అనుకుంటున్న విషయం కూడా తెలియడం కూడా ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. ఈసారి కూడా తెరాస తెలంగాణాలో జండా ఎగరవేయాలంటే కనీసపక్షం కేసీఆర్ ఉండాల్సిందే. అప్పుడే పార్టీ మరింతగా పాతుకుపోతుంది.

అప్పుడు పగ్గాలు ఎవరికి ఇచ్చినా పెద్దగా మార్పులు ఏమి ఉండవు అనేది కేసీఆర్ ఆలోచన గా ఉంది. మరోపక్క దేశీయంగా కూడా ఒకపక్క అభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటున్నాయి, మరోపక్క చైనా లాంటి దేశాలు యుద్ధం అంటూ దుందుడుకు పనులకు పూనుకుంటున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో రేపటి పరిస్థితి ఊహించడం సాధ్యం కానిపని. అందుకే ఈసారికి మళ్ళీ కేసీఆర్ ఉండటమే ఉత్తమం అని పార్టీ వర్గాలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు లేనిపక్షంలో, కరోనా కూడా లేని పక్షంలో అందరు అనుకుంటున్నది నేడు జరిగి ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేకపోవడం వలన కాస్త వాయిదా వేయక తప్పలేదు తెరాస కు.

మరింత సమాచారం తెలుసుకోండి: