ముఖ్యమంత్రి కెసిఆర్ గారు లిఖించిన, ప్రతి సంస్కరణకు కేంద్రబిందువు ప్రజలే.. అందుకే ఈ అద్భుత విజయాలు, అసాధారణమైన ఫలితాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఒక ఎత్తయితే, ఉజ్వల తెలంగాణ కోసం చేపట్టిన సంస్కరణోద్యమం దేశ చరిత్రలోనే  మరొక కొత్త అద్యాయమని మంత్రి కేటీఆర్ గారు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆనాడు  కరెంట్ అంటేనే సంక్షోభం. నేడు కరెంట్ అంటే  సంతోషం. ఆనాడు పట్టపగలే పారిశ్రామికవేత్తలకు కూడా రైతులతో పాటు అప్పటి సమైక్య పాలకులు ఇందిరాపార్క్ దగ్గర కరెంటు అడిగినందుకు  పట్టపగలే చుక్కలు చూపెట్టిన పరిస్థితి.

కానీ ఈరోజు వ్యవసాయరంగ మైన,పారిశ్రామికరంగ మైన,సామాన్య ప్రజానీక మైన ప్రతి రంగంలో,ప్రతి వర్గంలో వెలుగులు నింపిన రంగం విద్యుత్ రంగం. ఈ రంగంలో తెలంగాణ సాగించిన ప్రస్థానం వెలుగులమయమని చెప్పక తప్పదన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు కేవలం 7788 మెగావాట్ల  స్థాపిత సామర్థ్యం ఉంటే, అందులో కేవలం సప్లై చేయగలిగింది 5500 పై చిలుకు మెగావాట్లు మాత్రమే. రెండు వేల మెగావాట్ల లోటు విద్యుత్ తో మన ప్రయాణం ప్రారంభమైతే స్వల్ప సమయంలో 16425 మెగావాట్లకు ఈరోజు తాటి తో సమాజం చేరుకున్న దని అన్నారు. దాంతోపాటు సోలార్ రంగంలో కూడా ఈ రోజు భారత దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు భారతదేశంలో ఈరోజు తెలంగాణ అగ్రగామిగా ఉన్నదన్నారు. ఇది మన జీవన ప్రమాణాల సూచికలో ముఖ్యమైన గణాంకమని ఆయన అన్నారు. నిరంతర విద్యుత్ తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. అది వ్యవసాయరంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు నిరంతరం సృష్టించే  ఈ సంపదతో రాష్ట్ర సంపద పెరుగుతుంది, ఆ సంపద ఫంక్షన్ రూపంలో, రైతుబంధు రూపంలో, దళిత బంధు రూపంలో మళ్లీ తిరిగి  రాష్ట్ర ప్రజలకే దక్కుతుందన్నారు.

తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని, ఉన్న ఉద్యోగాలు పోతాయని ఆరోజు వెక్కిరించిన వారు ఈరోజు వాళ్లే కెసిఆర్ గారి పరిపాలన లో టిఎస్ ఐపాస్ లాంటి విధానాలతో తెలంగాణకు క్యూ కడుతున్న కంపెనీలను చూసి వా  క్యా బాత్ హై అనే పరిస్థితికి తెలంగాణ చేరింది అంటే ఆ క్రెడిట్ మొత్తం మన నాయకుడు కేసీఆర్ దే అని మంత్రి కేటీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: