టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి జైలు నుంచి బెయిల్ ద్వారా విడుదలైన తర్వాత ఏమయ్యారు? ఎక్కడున్నారు? బెయిల్ లభించిన తర్వాత ఎవరికి కనిపించట్లేదు  ఎందుకు? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మీడియా ముందుకు కానీ, జనం ముందుకు కానీ,చివరికి పార్టీ నాయకులు ముందుకు కానీ  ఎందుకు రావట్లేదు?రెండు రోజులుగా ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలివి.పట్టాభి దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో పట్టాభి అరెస్టయ్యారు. ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసారనే అభియోగంపై పట్టాభి ని పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో పోలీసులు ఆయనను మచిలీపట్నం కరాగారానికి తరలించారు. అక్కడి నుంచి ఆయన శుక్రవారం ప్రత్యేక వాహనంలో పోలీసులు భద్రత మధ్య రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు పట్టాభి. ఏపీ హైకోర్టు శనివారం ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత పట్టాభి అదృశ్యమయ్యారు. బాహ్య ప్రపంచం ముందుకు రాలేదు. పార్టీ నాయకులను కూడా కలుసుకోలేదు. జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు పట్టాభి చివరిసారిగా కనిపించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కారులో కూర్చుని తన అనుచరులు,పార్టీ అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆయన మాయమయ్యారు. ఈ క్రమంలో పట్టాభి ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది. హనుమాన్ జంక్షన్ లో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. అవేవి విశ్వసించ తగ్గ సమాచారం కాదంటూ టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయానికి  కూడా రాలేదు. పార్టీ నాయకులను ఎవరిని కలుసుకోలేదు. వారితో దూరంగా ఉంటూ వచ్చారు.

ఒకరకంగా పూర్తిస్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు అయింది పట్టాభి. పట్టాభి ఓ విమానంలో కనిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రెండు ఫోటోలు ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రత్యేకించి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని గ్రూపుల్లో ఈ ఫోటోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. బెయిల్ లభించిన తర్వాత ఆయన మాల్దీవులకు బయలుదేరి వెళ్లారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: