బ‌ద్వేల్ ఉప ఎన్నిక మ‌రో మూడు రోజుల్లో జ‌ర‌గ‌నుంది. అధికార వైసీపీ విజయం ఇక్కడ ఖాయమై పోయింది. అయితే ఇక్కడ బద్వేలు గిఫ్ట్ ను జగన్ ఓ నేత‌కు ఇచ్చేందుకు రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. బ‌ద్వేలు లో ఎమ్మెల్యేగా ఇప్ప‌టి వ‌ర‌కు దివంగ‌త నేత వెంకట సుబ్బ‌య్య ఉన్నారు. ఇప్పుడు సుధ ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె ఎమ్మెల్యేగా మాత్ర‌మే ఉంటారు. అయితే ఇప్పుడు అక్క‌డ పార్టీ ఇన్‌చార్జ్ గా మాత్రం వైసీపీ నేత డీసీ గోవిందరెడ్డి  ఉన్నారు. ఆయన బ‌ద్వేలు మాజీ ఎమ్మెల్యే. గ‌తంలో కాంగ్రెస్ నుంచి 2004లో ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక ఆయ‌న ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయింది. అయితే ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని టాక్ ?  త్వ‌ర‌లోనే 14 ఎమ్మెల్సీల‌ను జ‌గ‌న్ భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఈ పోస్టుల్లో ఒక‌టి ఖ‌చ్చితంగా గోవింద రెడ్డికే అంటున్నారు. ఆయ‌న జ‌గ‌న్‌కు,  పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వ‌స్తుంది. అప్పుడు మ‌రోసారి ఆయ‌న ఎమ్మెల్సీ కానున్నార‌ని అంటున్నారు. అయితే క‌డ‌ప జిల్లాలో చాలా మంది రెడ్డి నేత‌లు ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిలో జ‌మ్మ‌ల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాని కి చెందిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి కూడా రేసులో ఉన్నారు.

ఇక నందికొట్కూరు లో కూడా ఎమ్మెల్యే గా ఆర్థ‌ర్ ఉన్నారు. అయితే అక్క‌డ పార్టీ ఇన్ చార్జ్‌గా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు బ‌ద్వేల్లో ఎమ్మెల్యే గా సుధ ఉన్నా కూడా.. అక్క‌డ పార్టీ బ‌లోపేతం అవ్వాలంటే గోవింద రెడ్డి వ‌ల్లే సాధ్య మ‌వుతుంది. పైగా ప్రోటోకాల్ ప‌రంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఉండాల‌నే అంటున్నారు. అందుకే జ‌గ‌న్ ఈ ఉప ఎన్నిక ముగిసిన వెంట‌నే ఆయ‌న‌కు మ‌రోసారి ఎమ్మెల్సీ రెన్యువ‌ల్ చేస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: