ఏపీ లో ఉన్న తిరుమల తిరుపతిదేవస్థానం దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయిహరి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అధికారులు దగ్గరనుంచి ప్రజాప్రతినిధుల వరకు  వరకు అందరూ కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు తరలి వెళుతుంటారు. మహా మహా సంపన్నులు సైతం  శ్రీవారిని దర్శించుకుని భారీగా కానుకలు సమర్పించుకోవటం చేస్తూ ఉంటారు.



 ప్రతిరోజూ వేలల్లోనే భక్తుల తాకిడి ఉంటుంది   కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ భక్తులు భారీగా తరలివస్తుంటారు. అయితే  శ్రీవారి హుండీ ఆదాయం కూడా ప్రతిరోజు కోట్లలోనే వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది సంపన్నులు అయితే స్వామివారికి భారీగా ముడుపులు చెల్లించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఇటీవల ఒక భక్తుడు భారీ ముడుపులు చెల్లించుకున్నాడూ. ఇక ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే దీని విలువ ఎవరూ ఊహించలేనంత ఉంది. ఇటీవలే శ్రీవారిని దర్శించుకునేందుకు తమిళనాడుకు చెందిన భక్తులు వచ్చారు.


 కోయంబత్తూర్ కు చెందిన m&c ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే స్వామివారికి 3604 కిలోల బంగారు బిస్కెట్లను కానుకగా ఇచ్చారు  అయితే దీని విలువ ఏకంగా 1.83 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పాలి. ఆలయంలో ఉన్న రంగనాయకుల మండపంలో ఆలయ ఈవో ధర్మారెడ్డి కి ఇక ఈ కానుకను అందజేశారు  కంపెనీ ప్రతినిధులు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కంపెనీ ప్రతినిధులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd