బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జ‌రుగుతోంది. ఈ ఫ‌లితం వ‌చ్చే నెల 2వ తేదీన వ‌స్తుంది. ఉప ఎన్నిక అనేది ఇక్క‌డ నామ మాత్ర‌మే అన్న‌ది అంద‌రికి అర్థ‌మైంది. వైసీపీ బ‌ద్వేలు లో ఏక‌ప‌క్షంగా గెల‌వ‌బోతోంది. అయితే ఆ పార్టీకి ఎంత మెజార్టీ వ‌స్తుంది అన్న‌దే చూడాలి. ఆ పార్టీ నేత‌లు అయితే తాము 80 వేల మెజార్టీ సాధిస్తామని చెపుతున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం ఇక్క‌డ ఎట్టి ప‌రిస్థితి ల్లో నూ ల‌క్ష మెజార్టీ రావాల్సిందే అని ఇన్ చార్జ్ లు గా ఉన్న వారికి కండీష‌న్ పెట్టార‌ట‌. దీంతో ఇప్పుడు బ‌ద్వే లులో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ ఎంత మెజార్టీ తో గెలుస్తారు అన్న‌దే చూడాలి.

అయితే ఇక్క‌డ బీజేపీ సెకండ్ ప్లేసులో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ పార్టీకి క‌నీసం డిపాజిట్లు అయినా తెచ్చేందుకు మాజీ మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. అస‌లు బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల్లో పార్టీ ని ముందుండి న‌డిపించే బాధ్య త‌ల‌ను కూడా ఆ పార్టీ అధిష్టానం ఆది నారాయ‌ణ రెడ్డి మీదే పెట్టింది. ఆయ‌న టీడీపీ పాత ప‌రిచ‌యాల‌తో ఆ ఓట్ల‌ను కొంత వ‌ర‌కు అయినా బీజేపీకి ట‌ర్న్ చేసే బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు.

టీడీపీలో మండ‌లా ల వారీగా ఉన్న దిగువ స్థాయి నేత‌ల‌ను పిలిపిం చుకుని వారికి తుల‌మో ప‌ల‌మో ఇస్తూ వారిని ఈ ఎన్నిక వ‌ర‌కు బీజేపీకి చేయ‌మ‌ని అడుగుతున్నార‌ట‌. దీనిపై స్థానికంగా పెద్ద ప్ర‌చార‌మే జ‌రుగుతోంది. ఇంత జ‌రుగుతున్నా టీడీపీ జిల్లా నాయ‌క‌త్వం కాని.. రాష్ట్ర నాయ‌క‌త్వం కాని ప‌ట్టించు కోవ‌డం లేదు. పోలయిన ఓట్లలో కనీసం ఇరవై శాతం ఓట్లను సాధించాలని ఆది నారాయ‌ణ టార్గెట్ గా పెట్టుకున్నారు. మ‌రి ఆది టార్గెట్ ఎంత వ‌ర‌కు నెర వేరుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: