ఏపీ లో గంజాయి మూలాలు ఉన్నాయని ఇతర రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు అంటూ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేసారు. రోజురోజుకు ఏపీ ప్రతిష్ట దిగజారిపోతున్నా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం  వైఖరిపై కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి అని వ్యాఖ్యలు చేసారు. అన్నపూర్ణ అంధ్రప్రదేశ్ అనే స్థితి నుంచి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చారు అంటూ విమర్శలు చేసారు. ఎపీ పై పక్క రాష్ట్రాల వారు సెటైర్లు వేస్తున్నా... జగన్ లో చలనం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.

గంజాయి రవాణా చేస్తే.. చర్యలు తీసుకుంటామని చెబుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి మాటలతో మాయ చేస్తున్నారు అని విమర్శలు చేసారు. తెలంగాణా, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి అనేక రాష్ట్రాల అధికారులు చేసిన ప్రకటనలు ఎందుకు ఖండించడం లేదు అని నిలదీశారు. ఏపీలో గంజాయి సాగు విపరీతంగా పెరిగిపోయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ గంజాయి సాగును ధ్వంసం చేసే చర్యలను సీఎం ఎందుకు తీసుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసు యంత్రాంగంతో ప్రత్యేక ఫోర్స్ ను ఏర్పాటు చేసి దాడులు చేయించరా అని నిలదీశారు.

గంజాయి కేసులలో అమాయకులను ఇరికించి.. అసలైన సూత్రధారులను మాత్రం తప్పిస్తున్నారుఅని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అనేవి స్కూల్ పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి అని పేర్కొన్నారు. 13జిల్లాల్లో యువత ను గంజాయి నిర్వీర్యం చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు అన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల ప్రతిష్టను దిగజార్చేలా జగన్ పాలన ఉంది అని విమర్శలు చేసారు. సీఎం తన వ్యక్తిగత ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు అని అన్నారు. గంజాయి స్మగ్లర్లు నేడు పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేసారు. అన్నవరం సమీపంలో పోలీసులను వెంటాడి మరీ దాడి చేసిన పరిస్థితి ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: