ఏపీ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మంత్రి పేర్ని నానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని ఆయన వివరించారు. 1285 కొత్త ఉద్యోగాలు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో ఫార్మాసిస్టు ల పోస్టుల కల్పనకు అంగీకారాన్ని తెలిపింది అని ఆయన వివరించారు. మెడికల్ కళాశాలలో 2190 మందిని నియమించుకునేందుకు వీలుగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది అని ఆయన పేర్కొన్నారు. మొత్తం గా 4035 కొత్త ఉద్యోగాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అని వివరించారు.

వైద్యారోగ్య శాఖలో 41,308 ఉద్యోగాల భర్తీకి లక్ష్యం గా ఉంటే 26,917 ఉద్యోగాలు ఇచ్చాము అని అన్నారు. బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానం కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి కి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు మంత్రి. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని వివరించారు. అందుకే ఏపీ మంత్రిమండలి ఈ తీర్మానం చేసింది అని పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పధకం జూన్ మాసం లో అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు.

విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పధకం వర్తించేలా ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నామని తెలిపార్. నవంబర్ 2021 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు మొత్తం 130 రోజుల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాల్సిందే అని స్పష్టం చేసారు. గత ఏడాది కోవిడ్ కారణంగా హాజరుకు మినహాయింపు ఇచ్చాము అని అన్నారు. వివిధ పథకాల్లో అనర్హులుగా ఉన్న వ్యక్తుల అర్జీలను జూన్ లో ఒక మారు డిసెంబర్ లో ఒకమారు స్వీకరించి అర్హులకు పధకాలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారాన్ని తెలిపింది అని ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయానికి సినిమాటోగ్రఫీ చట్ట సవరణ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు వివిధ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రిమండలి తీర్మానం చేసింది అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap