శ్రీ‌కాకుళం మొద‌లుకుని క‌డ‌ప వ‌ర‌కూ ఎక్క‌డ చూసినా ఒక ఉప ఎన్నిక‌కు సంబంధించిన చ‌ర్చ జ‌ర‌గ‌డం ఇవాళ ఓ విశేషం. జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి దాస‌రి సుధ గెల‌వ‌డం అన్న‌ది ఖాయం అయినా మెజార్టీనే పెంచుకుని రావాల‌ని సీఎం భావించ‌డంతో చాలా మంది దృష్టి ఇటువైపు ప‌డింది.

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌కు సంబంధించి అంతా రాజ‌కీయం మారిపోతోంది. ముఖ్యంగా ఇక్క‌డ ప్ర‌ధాన విప‌క్షం టీడీపీ పోటీ చేయ‌డం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నా అంత ప్ర‌భావం అయితే చూప‌దు. అందుకే ఈ ఉప ఎన్నిక‌ను భారీ మెజార్టీతో కైవ‌సం చేసుకో వాల‌ని యోచిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ల‌క్షా 30 వేలు పైచీలుకు మెజార్టీ రావాల‌ని మంత్రుల‌ను, ఒక ఎంపీని మ‌రి యు ఇత‌ర ప్రాంత ఎమ్మెల్యేల‌ను మోహ‌రించి మ‌రీ! జ‌గ‌న్ రాజ‌కీయం చేస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ప్ర‌చారానికి తాను రాలేక‌పో తున్నాన‌ని జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో  ప్ర‌జ‌ల‌కు ఓ లేఖను రాశారు.అయితే ఈ ఎన్నిక‌కు సంబంధించి బీజేపీ చాలా వ్యాఖ్య‌లు చేసింది. వాటిపైనే చ‌ర్చ సాగుతోంది. ఈ ఇసుక తుఫాను ఏంట‌న్న‌ది చూద్దాం.

చాలా రోజులుగా ఏపీలో ఇసుక దందాలు సాఫీగా సాగిపోతున్నాయి. చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి కూడా ఇందులో భాగం అని తేలిపోయింది. ఇదే ఇప్పుడు బీజేపీకి ప్ర‌ధానాస్త్రం అయింది. బీజేపీ నేత విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డితో పార్టీ అధినాయ‌క‌త్వం మాట్లాడిస్తోంది. ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. దీనిపై చీఫ్ విప్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆరోప‌ణ‌లపై మాట్లాడుతూనే బీజేపీ రాష్ట్రానికి ఏం చెప్పిదో అవి చేశాక త‌మ పార్టీ వైసీపీ చేసిన అన్యాయాలు అక్ర‌మాలకు సంబంధించి మాట్లాడాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఆంధ్రావ‌నికి ప్ర‌త్యేక హోదా ఇస్తే తాము బ‌రిలో నుంచి త‌ప్పుకుంటామ‌ని చెప్పారు శ్రీ‌కాంత్ రెడ్డి. ఇదే ఎలానూ జ‌ర‌గ‌ని ప‌ని క‌నుక బీజేపీ త‌రువాత వీటిపై పెద్ద‌గా మాట్లాడ‌డం మానుకుంది. ఇక ఇసుక తుఫాను అన్న‌ది ఒక్క శ్రీ‌కాంత్ కో ఇంకెవ్వ‌రికో సంబంధించింది కాదు అన్ని ప్రాంతాల‌లోనూ య‌థేచ్ఛ‌గా ర‌వాణా సాగిపోతోంది. గ‌త ప్ర‌భుత్వం మాదిరిగానే ఈ ప్ర‌భుత్వ నాయ‌కులకు ఇసుక మాత్రమే ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అన్న‌ది ఓ వాస్త‌వం.






మరింత సమాచారం తెలుసుకోండి:

ycp