ఏపీలోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికకు అధికారులు స‌ర్వం సిద్ధం చేశారు. ఇక్క‌డ నుంచి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య అనారోగ్యంతో మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌మ అభ్య‌ర్థిగా వెంక‌ట సుబ్బ‌య్య భార్య డాక్ట‌ర్ సుధ కు ఛాన్స్ ఇచ్చింది. ఇక్క‌డ నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం గా ఉన్న టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా పోటీ చేయ‌డం లేదు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీ మాత్ర‌మే పోటీ చేస్తున్నాయి.

ఇక ఇక్క‌డ పోటీ వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ మ‌ధ్యే ఉంటుంద‌ని అంటున్నారు. బీజేపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో రైల్వే కోడూరు లో పోటీ చేసి ఓడిపోయిన సురేష్ ఈ సారి బ‌ద్వేలులో పోటీ చేస్తున్నారు. రెండు పార్టీలో ప్ర‌చారాన్ని హోరెత్తించాయి. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మొత్తం  281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన డాక్ట‌ర్ వెంకట సుబ్బ‌య్య కు ఏకంగా 44 వేల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది.

ఇక ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో 148  సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక కోసం 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ బ‌ల‌గాలు దిగాయి. వీటితో పాటు అదనపు బలగాలే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ విధులకు 1124 మంది సిబ్బంది ప‌ని చేయ‌నున్నారు.

ఇక నియోజకవర్గం లో మొత్తం 2.12,730 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,06,650 కాగా... మహిళలు1,06,069 మంది, ఇతరులు 20 మంది ఉన్నారు. ఇక ఈ నెల 30న పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. ఉప ఎన్నిక కౌంటింగ్ వ‌చ్చే నెల 2వ తేదీన జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: