ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా పెద్దగా వైరల్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మరియు మిగతా పార్టీల వారు. అందులో ప్రశాంత్ కిషోర్ ప్రధానంగా పేర్కొన్నది ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తనంతట తానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఓడిపోతుందని భావించిన రాహుల్ గాంధీ అది నిజం కాదని బీజేపీ అనేది ఒక్క రోజులో పోయే పార్టీ కాదని రానున్న 30- 40 ఏళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం గద్దె దిగొచ్చు అసంతృప్తి పెరిగినప్పుడు మాత్రమే అని అన్నారు. దీని బేస్  చేసుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఇంకొంతమంది ప్రశాంత్ కిషోర్ యూటర్న్ తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ చెప్పినదాన్ని ఎక్కువగా అనాలసిస్ చేయకుండా తక్కువ చేసినట్టు కనబడుతోంది.

 ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే పార్టీని బలోపేతం చేయడంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా అవకాశం ఉంది. కానీ ఆ పని చేయకుండా, ఎక్కడికక్కడ గొడవలే ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ బిజెపిలో గొడవలు అనేవి లేవా ఖచ్చితంగా ఉన్నాయి. కానీ బిజెపి పార్టీ వారు వాటిని ఎక్కడికక్కడ చల్లార్చడం లేదా ఏదో ఒక రకంగా సద్దుమణిగేలా చేయటం చేస్తున్నారు. ఇందులో వేరు చాలా ప్లాన్ గా చివరి డిసిజన్ అమిత్ షా లేదా  మోడీ దగ్గరికి వెళ్లి సెట్ చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ లో ఎవరో సిద్దు లాంటి లీడర్ ల కోసం అమరేందర్ సింగ్ ను వదులుకున్నట్టు వద్దని చెబుతున్నవిననటువంటి పరిస్థితి . ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక్కరోజులో పడిపోతుంది అనుకుంటే అమాయకత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్లేస్ ను అది ఆక్రమించుకుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు దాదాపుగా మెజార్టీ రాష్ట్రాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండేది. అక్కడక్కడ మాత్రమే ప్రాంతీయపార్టీలు డిఎంకె, ఎఐ డిఎం కే వాళ్ళు ఉన్నా వాళ్ళల్లో ఎవరో ఒకరు కాంగ్రెస్కు సపోర్ట్ గా ఉండే వారే. ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రమే డిఫరెన్స్ గా ఉండేవి. ఒక నాలుగైదు చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉండి, మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ ఉండేది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు ఎలా కాంగ్రెస్ ఉందో అలాగే పెద్ద రాష్ట్రాలు అన్నింటిలో పాలనలో ఉంది బిజెపి. దీంతో కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పాలించింది అలాగే  బిజెపి కూడా 30 నుంచి 40 సంవత్సరాల వరకు పాలిస్తుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: