ఇట‌లీ దేశ రాజ‌ధాని రోమ్ న‌గ‌రంలో శుక్ర‌వారం నుంచి ఆదివారం జీ- 20 స‌మావేశం జ‌రుగుతుంది. ఈ స‌మావేశాల్లో పాల్గొన‌టానికి మ‌న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇటలీ కి ప‌య‌నం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఇట‌లీ తో పాటు మ‌రి కొన్ని యూకే దేశాల‌ల్లో కూడా ప‌ర్య‌టించ నున్నారు. అలాగే గ‌త 12 సంవ‌త్స‌రాల నుంచి ఇట‌లీ లో భార‌త దేశ ప్ర‌ధాని ఎవ‌రు కూడా ప‌ర్య‌టించ లేదు. దీంతో 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత రోమ్ న‌గ‌రంలో ప‌ర్య‌టించిన భార‌త దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ గా ఉన్నారు. అందులో భాగంగానే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వాటిక‌న్ సిటీ లో కూడా ప‌ర్య‌టించారు. అంతే కాకుండా పోప్ ఫ్రాన్సిస్ తో కూడా ప్ర‌ధాని మోడీ స‌మావేశం అయ్యారు.



ప్ర‌ధాని మోడీ, పోప్ ఫ్రాన్సిస్ ల మ‌ధ్య స‌మావేశం దాదాపు గంట పాటు జ‌రిగింది. అయితే వీరు ఇద్ద‌రు మ‌ధ్య‌ భేటి చాలా ఉత్కంఠ నెలకొంది. అలాగే మోడీ పోప్ ల మ‌ధ్య జ‌రిగిన స‌మావేశం చాలా అంశాలు చ‌ర్చ కు వ‌చ్చినట్టు స‌మాచారం. ముఖ్యంగా పోప్ ఫ్రాన్సిస్ ను భార‌త దేశ ప‌ర్య‌ట‌న కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి ఆహ్వ‌నించారు. అలాగే ఈ రోజుల్లో ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప‌లు స‌వాళ్ల పై వీరు చ‌ర్చించారు. ముఖ్యం గా ప్ర‌పంచ శాంతి గురించి మాట్లాడారు. ముందుగా ప్ర‌ధాని మోడీ ని పోప్ ఫ్రాన్సిస్ ఆలంగినం చేసు కుని త‌మ నివాసానికి ఆహ్వానించారు. వీరి ఆలంగినం అక్క‌డి ఉన్న వారిని ఆక‌ట్టు కుంది. అయితే స‌మావేశం లో ప్ర‌ధాని మోడీ తో పాటు మ‌న దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జై శంక‌ర్ ఉన్నాడు. అలాగే మ‌న దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హా దారుడు అజిత్ ధోవ‌ల్ ఉన్నాడు.  





మరింత సమాచారం తెలుసుకోండి: