ప్రభుత్వ పథకాలపై మరోసారి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాకర్షణ పధకాలకు అధికంగా డబ్బు ఖర్చు పెట్టద్దని.. రైతుకు కావాల్సింది క్వాలిటీ ఉన్న విద్యుత్ పది నుంచీ పన్నెండు గంటలు ఇవ్వాలని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. గ్రామీణ గోదాములు నిర్మించాలని.. రైతు పరపతి వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలన్నారు వెంకయ్య నాయుడు.  ఉచితాలతో, తాత్కాలిక జనాకర్షణ పధకాలతో మేలు అందరికి జరగదని.. అందరికీ తెల్ల రేషను కార్డు ఉందా ? అని ప్రశ్నించారు వెంకయ్య నాయుడు.  

ఉచితంగా ఇస్తే... మధ్యాహ్నం మట్ట గుడిసె ఇస్తే సాయంత్రం కొరమీను కా వాలంటారని.. దేశ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్ ఉండాలి.. ఇక్కడే అమ్మండి, అక్కడే అమ్మండి అని మనమెవరు చెప్పడానికి ? అని వెల్లడించా రు వెంకయ్య నాయుడు,. చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలొస్తాయా..? ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తుందా..? ఆలోచనలో మార్పు రావాలని కోరారు వెంక య్య నాయుడు. చదువుకున్న యువత గ్రామాలకు వెళ్ళాలి, బ్యాక్ టూ విలేజెస్..  వ్యవసాయ రంగంలో సాంకేతికత పెరగాలి... ప్రైవేటు రంగం  కూ డా దానికి సహకరించాలని తెలియ జేశారు వెంకయ్య నాయుడు.  

పట్టభద్రులైన యువత తమ పేరుపక్కన ఫార్మర్ అని రాసు కునేందుకు గర్వించే పరిస్ధితి రావాలని.. కరోనా కాలంలో ముందువరుస పోరాట యోధులుగా రైతులు పని చేశారని గుర్తు చేశారు వెంకయ్య నాయుడు. వ్య వసాయ ఉత్పత్తిని మొక్కవోని దీక్షతో పెంచారు... కృషిని గుర్తించారనే సంతృప్తితో ఈ అవార్డులు అన్నారు వెంకయ్య నాయుడు,.  ప్రభుత్వం చే యాల్సిన పని ఒక ప్రైవేటు సంస్ధ చేయడం గర్వించదగినదని.. రైతులను కలిసినా, వారితో సంభాషించినా సంతోషం కలుగుతుందని చెప్పారు వెంక య్య నాయుడు. మా తాత వ్యవసాయాన్ని జీవితంగా భావించేవారు.. కష్ట నష్టాలున్నా వ్యవసాయంతో రైతు ఆనందం పొందుతాడన్నారు వెంకయ్య నాయు డు.


మరింత సమాచారం తెలుసుకోండి: