తమిళనాడుకు  చెందిన యువకుడు నీట్ ఎగ్సామ్ రిసల్ట్ రాకముందే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా కినాతుకడవుకు చెందిన 20 ఏళ్ల యువకుడు కీర్తివాసన్ నీట్ లో రిజల్ట్స్ రాకముందే ఆత్మహత్యకు గురయ్యాడు. అందు కు కారణం తాను పరీక్షలో పాస్ కానేమో అన్న సందిగ్ధం. కీర్తివాసన్  ఇప్పటివరకు మూడుసార్లు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. కానీ మూడు పరీక్షల్లో అర్హత సాధించలేదు కానీ నాలుగవ సారి కూడా పరీక్షను పాస్ అవుతానని నమ్మకంతో నీట్ పరీక్షకు హాజరై పరీక్షా రాసాడు కానీ ఈ సారికూడా పరీక్షా తప్పుతానేమో నన్న భయంతో ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

IHG

 కీర్తివాసన్ తన తల్లితో పరీక్ష విషయమై తనదగ్గర ఆందోళన చెందుతూ ఉండేవాడని ..అందులోను పరీక్ష లో ప్రశ్నలు చాల కష్టతరంగా ఉన్నాయని బాధపడేవాడని అతని తల్లి వెల్లడించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కీర్తివాసన్ ను వైద్యం కోసం పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు కానీ పరిస్థితి విషమించడంతో వెంటనే కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి కీర్తివాసన్ ను తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. ఆసుపత్రి పోస్టుమార్టాన్ ను నిర్వహించింది. కినతుకడవు పోలీస్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. అయితే నీట్ ఎక్సమ్ కారణంగా ఇప్పటివరకు ఐదు బలవన్మరణాలు నమోదు కాబడ్డాయి. గత సెప్టెంబర్ 12 న పరీక్ష జరిగిన తరువాత 5 రోజుల్లోనే ముగ్గురు అభ్యర్థులు తమ ప్రాణాలను తీసుకున్నారు.




IHG
 సెప్టెంబర్ 11 న  సేలం కు చెందిన 20 ఏళ్ళ ధనుష్ అనే యువకుడు మూడవసారి కూడా పరీక్ష లో ఉతీర్ణత సాధించలేననే విచారణలో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు. పరీక్ష జరిగిన ఒకరోజు తరువాత అరియలూరు కు చెందిన 17 ఏళ్ళ కనిమొళి అనే యువతీ ఆత్మహత్య చేసుకుంది . సెప్టెంబర్ 15 న వేలూరు జిల్లాకు చెందిన సౌందర్య నీట్ కారణంగా ప్రాణాలు తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో ఉరంపాక్కమ్‌కు  చెందిన 17 ఏళ్ళ నీట్ ఆశాకిరణం అయినటువంటి కె అను అనే యువతీ తన ప్రణాలను తీసుకోవడానికి ప్రయత్నించి దాదాపు నెల రోజులతరువాత గాయాల కారణంగా మరణించింది. అయితే ఈ ఆత్మహత్యల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం నీట్ లాంటి పోటీ పరీక్షలను ఎదుర్కోలేక మానసిక ఆందోళన చెందుతున్న వారికోసం ఇప్పటికే  ప్రత్యేక హెల్ప్లైన్ ని కూడా ఏర్పాటుచేసింది. జరుగుతున్న ఈ ఘటనలతో ప్రభుత్వం కొత్త ఒరవడులకు  శ్రీకారం చుట్టనుంది అందుకు ఎకె రాజన్ కమిటీ  నివేదికను ఆధారం చేసుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: