సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు నేడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పూర్వ విద్యార్థులు ఎదిగిన తర్వాత వాళ్ళు స్కూలు గురించి మర్చిపోకుండా స్కూలు అభివృద్దికి సహకారం అందించారు అని అన్నారు. పదవి అలంకారం కాదు బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. పదవి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోకుండా సేవ చేయడమే పదవికి న్యాయం చేయడం అని అన్నారు. మనిషికి మానసిక వికాసానికి విద్య ఉపయోగపడుతుంది అని తెలిపారు. సమాజం, దేశం అభివృద్ధి చెందడానికి విద్యే కారణం అని అన్నారు.

విద్య ప్రాధాన్యత గురించి ఆలోచించి స్కూలు ఏర్పాటు చేసిన సీతారామయ్య గారు అభినందనీయులు అని ఆయన కొనియాడారు. కులం, మతం మనం కల్పించుకున్నవి అని లేని వాళ్ళని పైకి తీసుకురావడం కూడా ప్రాధమిక హక్కే అని స్పష్టం చేసారు. కులం, మతం ఏదైనా అందరూ సమానమే అని పేర్కొన్నారు. మీ స్నేహితులను కులం ఏంటి అని విద్యార్థులు అడగవద్దు అని ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ప్రాధమిక హక్కు స్పష్టం చేసారు. జడ్జిమెంట్ తప్పని చెప్పవచ్చు కాని వ్యక్తిగతంగా విమర్శించకూడదు అని సూచించారు.

సోషల్ మీడియా లో కులం, మతం ఆధారంగా జరుగుతున్న ప్రచారం ఆపేయాలి అని కోరారు. కరోనా సమయంలో పిల్లలు సంపాదన పరులైన తల్లిదండ్రులని కోల్పోయారు అని అన్నారు. అటువంటి పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించగలిగాం అని పేర్కొన్నారు. చట్టాలు చాలా ఉన్నాయి అని వాటి అమలులోనే సమస్య ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. కాగా ఈ మధ్య కాలంలో కులం విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరగడం అలాగే కులాల గొప్పతనాలు చెప్పుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక కులాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో దూషణలు కూడా ఎక్కువగా పెరగడం జరుగుతూ వస్తుంది. దీనిపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: