కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌కు రాలు ప్రియాంక గాంధీ ఉత్త‌ర ప్ర‌దేశ్ పై పూర్తి గా దృష్టి సారించారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టే విధంగా ప్రియాంక బాటలు వేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇప్ప‌టి నుంచి రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టిస్తున్నారు. తాజా గా ఇందిరా గాంధీ వర్ధింతి సంద‌ర్భంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పూర్ లో ప్ర‌తిజ్ఞా ర్యాలీ ని నిర్వ‌హించారు. అయితే గోర‌ఖ్ పూర్ ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ సొంత నియోజ‌క వ‌ర్గం. కాగ ఈ గోర‌ఖ్ పూర్ లో బీజేపీ పాల‌న‌ పై ప్రియాంక గాంధీ ఘాటు గా మాట్లాడారు. క‌రోనా వ‌ల్లే దేశ ప్ర‌జ‌లు ఇప్ప‌టికే చాలా ఇబ్బందులు ప‌డితే.. ఇప్పుడు అధిక ధ‌ర‌ల వ‌ల్ల నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. కానీ ఇవేవి ప‌ట్టించు కోకుండా మోడీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హిరిస్తుంద‌న్నారు.



అలాగే ఉత్తర ప్ర‌దేశ్ లో యోగీ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషం గా లేర‌న్నారు. అలాగే రైతుల పై వాహానాన్ని ఎక్కించిన కేంద్ర మంత్రి కొడుకు ఇంకా బ‌య‌ట‌నే తిరుగుతున్నాడు.. దీనికి కార‌ణం యోగి పాల‌న కాదా అని  ప్ర‌శ్నించారు. ఎంతో మంది రైతులు చ‌నిపోతే ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌శాంతం గా ఉంది అని కేంద్ర హోం మంత్రి అంటున్నార‌ని విమ‌ర్శించారు. అలాగే త‌న ప్రాణం పోయిన బీజేపీ తో క‌లిసి ప‌ని చేయ‌ను అని ప్ర‌క‌టించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ అభివృద్ధి కేవ‌లం కాంగ్రెస్ సార‌థ్యంలో నే అవుతుంద‌ని అన్నారు. అలాగే యూపీ లో ఉన్న ప్ర‌తి ప‌క్షాలు కూడా  బీజేపీ కి స‌లాం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. అయితే త్వ‌ర‌లో నే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బీజేపీ ని గ‌ద్దే దించి కాంగ్రెస్ ప్ర‌భుత్వా న్ని ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. అలాగే ప్ర‌తి ప‌క్షాలుగా ఎస్పీ, బీఎస్పీ విఫ‌లం అయ్యాయ‌ని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: